విజయనగరం

ఎంపీపీ అవిశ్వాసం ఉత్తిమాటేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, జూన్ 19: జామి మండల ఎంపీపీ పదవీ మార్పుపై ఎన్నికల ముందు జరిగిన జంటిల్‌మెన్ ఒప్పందానికి తాను వ్యతిరేకమని భీమసింగి ఎంపీటీసీ గేదెల వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో పార్టీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ళు ప్రస్తుత ఎంపీపీ పారశాన అప్పయ్యమ్మ పదవి చేపట్టాల్సి ఉండగా మిగిలిన రెండున్నరేళ్ళు జామికి చెందిన ఎంపీటీసీ ఇప్పాక చంద్రకళ ఎంపీపీ పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పదవీ మార్పు జరగలేదు. అప్పటి పెద్దలు లగుడు సింహాద్రి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన ఈ జంటిల్‌మెన్ ఒప్పందం తారుమారు అయింది. పదవీ మార్పు చేయించాల్సిన పెద్దలే ఇప్పాక చంద్రకళకు మద్దతు ఇవ్వకుండా మొదటిగా ఎంపీపీ పదవి చేపట్టిన పారశాన అప్పయ్యమ్మనే కొనసాగించాలని ఎంపీటీసీలు, పెద్దలు సమావేశమై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ తరుణంలో రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వాల ఒత్తుడులు మేరకు జెంటిల్‌మెన్ ఒప్పందాలు ఏవైతో ఉన్నాయో వాటన్నింటిని అమలు చేయాలని, తెలుగుదేశం పార్టీనిర్ణయించడంతో పదేపదే ఈ పదవీ మార్పుపై తగాదాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎంపీపీ పదవి కోసం ఆశావాహులుగా ఉన్న ఇప్పాక చంద్రకళకు ఎంపీపీ పదవి కలగానే మిగిలిపోయింది. ఈ తరుణంలో ఎల్.కోటలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి వద్ద ఏర్పాటు చేసుకున్న రహస్య సమావేశంలో చంద్రకళను ఎంపీపీని చేయాలని తీసుకున్న నిర్ణయం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో ఇన్నాళ్ళులేని పదవీ మార్పు ఇప్పుడు ఏమిటని జిల్లా నాయకత్వం ప్రశ్నించిందని ముక్తసరి సమచారం. దీంతో మళ్ళీ చంద్రకళ ఎంపీపీ కావడం కలగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఎంపీపీ పదవి అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన పోరం మెంబర్‌కు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జామి ఎంపీటీసీ, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇటీవల మృతి చెందడం, దీనికితోడు భీమసింగికి చెందిన ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీకి చెందినది కాకపోవడం, వై ఎస్సార్ పార్టీ నుండి గెలిచిన ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ సభ్యులు తెలుపుతున్న అవిశ్వాసానికి తాను వ్యతిరేకమని ప్రకటించడం మళ్ళీ కథ కంచికి చేరింది.

నేల ఆరోగ్యంతోనే పంటల ఆరోగ్యం
బొండపల్లి, జూన్ 19: నేల ఆరోగ్యంతోనే పంటల ఆరోగ్యం సాధ్యపడుతుందని మండల వ్యవసాయ అధికారి కె. రవీంద్ర అన్నారు. మంగళవారం మండలంలోని వెదురువాడ, జె.గుమడాం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు వాడకాన్ని మానివేస్తే నేల ఆరోగ్యం బాగుంటుందని, దీంతో ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడాలని సూచించారు. వరిలో వంగడాలు మార్పు అనేది చాలా ముఖ్యమైనదని చెప్పారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో భూసారాన్ని పెంపొందించవచ్చు అని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండించాలని చెప్పారు. ఘన జీవామృతం వాడడం ద్వారా పురుగులు, తెగుళ్లు నివారించవచ్చు అని చెప్పారు. కార్యక్రమంలో ఏఇవొలు కృష్ణమూర్తి, సంతోష్, ఎంపీ ఇవొలు నాయుడు, ఉద్యానవన శాఖ ఎంపీఇవొ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.