విజయనగరం

విజయ విశాఖ డెయిరీ పాడిరైతులకు ఏరువాక నగదు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, జూన్ 19: మండలంలోని అన్నమరాజుపేట గ్రామానికి చెందిన శ్రీ విజయ విశాఖ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు మంగళవారం ఏరువాక నగదు బదిలీ కింద 90వేల రూపాయలను పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా పాలసేకరణ కేంద్రం నిర్వాహకుడు లింగాల నారాయణరావు మాట్లాడుతూ పాడి రైతుల అభ్యున్నతికి శ్రీ విజయవిశాఖ డెయిరీ యాజమాన్యం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ పథకాలను రైతులు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఏరువాక నగదు బదిలీ కింద గ్రామంలో ఉన్న 80 మంది పాడి రైతులకు 90వేల రూపాయలను అందజేశారని అన్నారు. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం అనేక రాయితీలను అందజేస్తుందని చెప్పారు. పాడి రైతుల కుటుంబ సభ్యులకు రాయితీపై విద్య, వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. పశువులకు బీమా సదుపాయం వంటి అనేక కార్యక్రమాలు శ్రీవిజయ విశాఖ డెయిరీ అందజేస్తుందని అన్నారు. ఈ పాలసేకరణ కేంద్రం ద్వారా ప్రస్తుతం రోజుకి 200 లీటర్లుసేకరించడం జరుగుతుందని, రానున్న రోజుల్లో 500 లీటర్లకు పైగా పాల సేకరణ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని పాల ఉత్పత్తిదారుల సంఘం తెలిపింది. ఈ కార్యక్రమంలో మద్ది పాల సీతలకేంద్రం పర్యవేక్షకుడు వై. భగవాన్, పాలసేకరణ కేంద్రం సభ్యులు లింగాల నర్సింగరావు, మువ్వరమణ, బొట్ట సన్నిబాబు తదితరులు ఉన్నారు.

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపు
జామి, జూన్ 19: మండల కేంద్రమైన జామిలో సోమవారం రాత్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పైడితల్లి అమ్మ ఆలయ అర్చకుడు వెలవెలసాయి, ప్రధాన అర్చకుడు ఉప్పల రత్నాజీల ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జామి గ్రామ పురవీధుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఈ విగ్రహాన్ని మంగళవారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో పైడితల్లి అమ్మ ఆలయ ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్ఠింపచేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్య భక్తులు తరలి వెళ్ళి పూజలు నిర్వహించారు.