విజయనగరం

అందరికీ గ్యాస్ అందాలన్నదే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జూన్ 19: అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సిఎస్‌డిటి ఎన్.వి.వి. ఎస్.మూర్తి అన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డిపో డీలర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి గ్యాస్ ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు. అర్హులను గుర్తించి గ్యాస్ అందేలా బాధ్యత డీలర్లు తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రతిరోజు రేషన్ డిపోను నిర్థేశిత సమయంలో తెరచి ఉంచాలని సూచించారు. అందరికీ రేషన్ అందించేందుకు కృషి చేయాలని కోరారు.

భూ రికార్డులను ప్రజల ముందు ఉంచుతాం
బొండపల్లి, జూన్ 19: భూ సంబంధిత అన్ని రికార్డులు రెవెన్యూ గ్రామ సభల్లో ప్రజల ముందు ఉంచడం జరుగుతుందని ఉప తహశీల్దార్ కె. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జూలై 3వరకు అన్ని రెవెన్యూ గ్రామాలలో సభలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలలో గల ప్రభుత్వ భూములను ఇప్పటికే గుర్తించామని, వాటిని ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు. జిరాయితీ భూమి అయిన ప్రభుత్వ భూమిగా నమోదు అయితే సదరు రైతులు తమకు అర్జీలు ఇవ్వాలని కోరారు. రైతులు రెవెన్యూ సభలకు వస్తే రెవెన్యూ పర భూ సంబంధిత రికార్డులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అసైన్డ్ భూములు, పోరంబోకు, దేవాదాయ, ల్యాండ్ సీలింగ్, కోర్టు పరిధిలో భూములను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. గ్రామకంఠం భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించడంలేదని అన్నారు. నోషనల్ ఖాతాలు కలిగిన రైతులు వాస్తవ పరిస్థితులను రెవెన్యూ అధికారులు నిర్థారణ చేసి వారికి న్యాయంచేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు రెవెన్యూ సభల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ చప్ప గణపతిరావు పాల్గొన్నారు.