విజయనగరం

మెయింటెనెన్స్ కార్మికుల కుదింపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 21: ఆర్టీసీ మెయింటెనెన్స్ కార్మికుల కుదింపుపై ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయకపోతే సమ్మె చేయక తప్పదని ఎంప్లారుూస్ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు గొల్లపల్లి రవికాంత్ అన్నారు. ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులపై పనిభారం పెంచుతూ జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఇక్కడ డిపో ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ మెయింటెనెన్స్ కార్మికులను తగ్గించేందుకు ఈనెల 15వతేదీన గుర్తింపుకార్మిక సంఘమైన ఎన్‌ఎంయు అంగీకారంతో యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందని ఆరోపించారు. ఈ సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల సవరణపై జాప్యం జరుగుతున్నందున వెంటనే 27శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. అద్దె బస్సులను పెంచే ప్రతిపాదనలను యాజమాన్యం పూర్తిగా విరమించుకోవాలన్నారు.
నిలిపివేసిన కారుణ్య నియామకాలను కొనసాగించాలన్నారు. కాలం చెల్లిన టిమ్స్ మిషన్లను వెంటనే మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టిఎస్‌ఎన్ రాజు, కెవి రమణ పాల్గొన్నారు.

చోరీ సొత్తు వసూలు

విజయనగరం, జూన్ 21: ఇటీవల పూసపాటిరేగలో దొంగతనానికి పాల్పడిన నిందితుడు భుత్తల రమేష్‌ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. గురువారం అతని నుంచి 2.5 తు లాల బంగారం, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ ఎఎస్ చక్రవర్తి తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంలో ఎ స్సైలు రాజారావు, ఎస్‌ఎస్ నాయుడు, జి.కళాధర్, సిబ్బంది ఉన్నారు.