విజయనగరం

ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 21: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకు ఎన్‌ఎంయు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా కృ షి చేస్తుందని, ఈ మేరకు వేతన సవరణ ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చం ద్రబాబుని కోరిందని ఎన్‌ఎంయు డిపో కార్యదర్శి పిజి రాఫిల్ తెలిపారు. యూ నియన్ డిపో కమిటీ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీ నివాసరావు తీసుకువెళ్లారని చెప్పారు. కార్మికుల వేతన సవరణకు సంప్రదింపుల కమిటీ ఏర్పాటుకు ఏడాది మార్చి 5వతేదీన మంజూరు చేసినప్పటికీ, 2017 ఏప్రిల్ 1వతేదీ నుంచి పేస్కేల్‌కు సంబంధించి 15నెలలు జాప్యమైనప్పటి కీ, ఇంతవరకూ యాజమాన్యం ఎలాం టి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల వేతన సవరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. పల్లె వెలుగు నష్టాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక తోడ్పాటు అందించాలని, ఇంతకుముందు అంగీకరించిన ఆర్టీసీ కార్మికులకు గృహ నిర్మాణానికి ఆదేశా లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఈ సమావేశంలో యూనియన్ డిపో కమిటీ అధ్యక్షుడు డిఎన్‌రాజు, కెఎస్‌ఆర్ రాజు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా పోరాటానికి నేడు సంఘీభావ ర్యాలీ
పార్వతీపురం, జూన్ 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాటానికి ఈనెల 23తేదీన శుక్రవారం పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తామని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ర్యాలీని పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభించి నాలుగు కిలోమీటర్ల దూరంలోని నర్సిపురం వరకు కొనసాగిస్తామని తెలిపారు. నీతి అయోగ్ సమావేశంలో సిఎం చంద్రబాబు రాష్ట్ర విభజనవల్ల ఏర్పడే సమస్యలు, ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి 20నిమిషాల వరకు వివరించారన్నారు. ఎపికి ప్రత్యేక హోదాకోసం సిఎం చేస్తున్న పోరాటానికి పార్టీ రహితంగా మద్ధతు ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న సిఎం చంద్రబాబు వ్యవసాయరంగంలో దేశవ్యాప్తంగా 2.42శాతం వృద్ధి రేటు ఉంటే రాష్ట్రంలో 11శాతం వృద్ధి రేటు సాధించడం విశేషమన్నారు. అన్ని రంగాల్లో దేశంలో అభివృద్ధిరేటు 7శాతం ఉంటే ఎపిలో 10.5శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. హుదూద్ తుపాను సమయంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడంలో సిఎం చంద్రబాబు తీవ్రంగా కష్టపడ్డారన్నారు. రాష్ట్రానికి 2019లో రైల్వేజోన్ కడప ఉక్క్ఫుక్టరీ 2019 ఇస్తామని చెబుతున్న బిజెపి నాయకులు మాటలు హాస్యాస్పదంగా ఉందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నాయకులు మాటలు చూస్తే ప్రజలతో బిజెపి నాయకులు ఆటలాడుకుంటున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్పకతప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, తెదేపా పట్టణ అధ్యక్షుడు కోలా వెంకటరావు, తెదేపా నాయకులు బార్నాల సీతారాం, భీమవరపుకృష్ణమూర్తి, జాగాన రవికుమార్ పాల్గొన్నారు.