విజయనగరం

బాలబాలికలు బాగా చదువుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 21: బాలబాలికలు బాగా చదువుకొని పేదరికపు విషవలయం నుంచి బయటపడాలని జిల్లా ఎస్పీ పాలరాజు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక యువజన వసతి గృహంలో జిల్లా స్థాయి బాలల ఆలోచన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, నేచర్ చైల్డ్ఫ్‌ండ్ ఇండియా, చైల్డ్‌లైన్ సంస్థలు అందజేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. జీవితంలో లక్ష్యాలను ఎంచుకొని వాస్తవ స్థితిగతులకు అనుగుణంగా ఆకర్షణలకు లొంగకుండా, సామాజిక సంక్షోభ సమస్యలకు గురికాకుండా చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికా సంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి మాట్లాడుతూ న్యాయపరంగా అందిస్తున్న సేవలు, 200 చట్టాల పుస్తకాల లైబ్రరీలు జిల్లాలో ఐదుచోట్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతమైన సాలూరు మండలం పి.కోనవలసలో ఏర్పాటుచేసి కంప్యూటర్లను సమకూర్చామన్నారు. విద్య, ఆరోగ్యం, బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ఐసిడిఎస్ ఇన్‌ఛార్జి పిడి వసంతబాల మాట్లాడుతూ బాలల భాగస్వామ్యపు హక్కుకు మద్దతు తెలుపుతూ నేచర్ సంస్థ చేపట్టే సమాలోచన సదస్సులో బాలలను అభినందించారు. ఆరోగ్యంగా ఉంటూ విద్యలో రాణించాలన్నారు. ఎపి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కేసలి అప్పారావు మాట్లాడుతూ బాలల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసి సమాజానికి పరిచయం చేస్తున్న నేచర్ చైల్డ్ఫ్‌ండ్ ఇండియా, చైల్డ్‌లైన్ సిబ్బందికి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నేచర్ వ్యవస్థాపక డైరెక్టర్ ఎస్‌బి బాలరాజు మాట్లాడుతూ బాలల హక్కుల భద్రత, బాలల భవిష్యత్‌పై వారిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్టూనిస్టు బి.హరివెంకటరమణ బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ శాఖలకు నివేదించడంలో చేపట్టాల్సిన చర్యలు, కార్టూన్‌లను రూపొందించే పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ సునీతశెట్టి నేతృత్వంలో బాల్య వివాహాల నిరోధం, బాలల సంక్లిష్ట సమస్యలపై బాలలు ఎదుర్కొంటున్న తీరు గురించి వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ జికె దుర్గ, ఎల్ వరలక్ష్మి, సిహెచ్ చిన్న, ఎం సుభాష్, విశాఖ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణబాబు పాల్గొన్నారు.వహించిన నేచర్ వ్యవస్థాపక డైరెక్టర్ ఎస్‌బి బాలరాజు మాట్లాడుతూ బాలల హక్కుల భద్రత, బాలల భవిష్యత్‌పై వారిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్టూనిస్టు బి.హరివెంకటరమణ బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ శాఖలకు నివేదించడంలో చేపట్టాల్సిన చర్యలు, కార్టూన్‌లను రూపొందించే పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ సునీతశెట్టి నేతృత్వంలో బాల్య వివాహాల నిరోధం, బాలల సంక్లిష్ట సమస్యలపై బాలలు ఎదుర్కొంటున్న తీరు గురించి వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ జికె దుర్గ, ఎల్ వరలక్ష్మి, సిహెచ్ చిన్న, ఎం సుభాష్, విశాఖ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణబాబు పాల్గొన్నారు.

సంతకాల బ్రిడ్జి వెంటనే ప్రారంభించాలి

విజయనగరం, జూన్ 21: పట్టణంలోని ఎత్తుబ్రిడ్జి వద్ద నూతనంగా నిర్మించిన సంతకాల బ్రిడ్జి పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంకను ప్రారంభించకపోవడానికి కారణమేమిటని వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. గురువారం ఉదయం వైసీపీ ఆధ్వర్యంలో సంతకాల బ్రిడ్జి వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎత్తు బ్రిడ్జివద్ద ట్రాఫిక్ ఇబ్బందులను గుర్తించి గత ప్ర భుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ బ్రిడ్జిని ప్రారంభించక పోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయన్నారు. బ్రిడ్జిని ప్రారంభించడంలో జాప్యానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ముడుపులు అందకపోవడం వల్లనే జాప్యం జరుగుతుందా అని విమర్శించారు. ఇప్పటికైనా బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలన్నారు. లేనిచో పోరాటం కొనసాగిస్తామన్నారు. బ్రిడ్జి ప్రారంభించకపోవడంపై జాతీయ రహదారుల అధికారులకు ఫోన్ చేస్తే సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిని వినియోగంలోకి తేచ్చే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ సందర్భంగా మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ సుమారు 13 కోట్ల రూపాయలతో సంతకాల బ్రిడ్జిని నిర్మించారని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడానికి కారణమేమిటన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆశపు వేణు, నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ రాజేష్, కౌషిక్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.