విజయనగరం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేడు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 21: ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా లక్ష్మినారాయణ శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నారు. జిల్లా పర్యటనకు తొలిసారిగా వస్తున్నందున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు భారీఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఆయన 22న ఉదయం 9.30 గంటలకు పట్టణంలోని విద్యుత్ భవన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నాయకులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుం చి ర్యాలీగా బయలుదేరి 10.30 గంటలకు శ్రీపైడితల్లి అమ్మవారి ఆలయం చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఆఫీసు బేరర్లతో సమావేశం నిర్వహిస్తారు. సా యంత్రం 4 గంటలకు కోర్ కమిటీ సమావేశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మేథావులతో సమావేశం ఉంటుం ది. రాత్రి 8 గంటలకు జొన్నగుడ్డి ఎస్పీ కా లనీలో సహపంక్తి భోజనం చేస్తారు. 23న ఉదయం 9 గంటలకు పరివార్‌తో సమావేశం, తర్వాత మేధావులతో సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
సాయంత్రం 4 గంటలకు ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతారని పార్టీ నాయకులు పాకలపాటి సన్యాసిరాజు, బి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

యోగతో ఆనందమయ జీవనం

విజయనగరం, జూన్ 21: అనేక దే శాలు యోగాకు అత్యంత ప్రాధాన్యతఇస్తున్నాయని డీఆర్వో జె వెంకటరావు అన్నారు. నాలుగో అంతర్జాతీయ యో గా దినోత్సవాన్ని పురస్కరించుకొని గు రువారం స్థానిక గురజాడ గ్రంథాల యంవద్ద కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, ఆయుష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోగా దేశంలోనే ప్రారంభమైనప్పటికీ మన దేశంలో యోగను అనుసరించే వారి స ంఖ్య తక్కువగా ఉందన్నారు. ఆనందమయ జీవనానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి.నర్సింగరావు, ఆర్డీవో జెవి మురళీ, ఉద్యానశాఖ డిడి లక్ష్మినారాయణ, ఎస్‌ఎస్‌ఎ పివో లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఎం విజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పోలీసు మైదానంలోనూ, ఎంఆర్ కళాశాల, సీత ం కళాశాల, గాయత్రి కళాశాల ప్రాం తాల్లో యోగ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

విజయనగరం, జూన్ 21: దేశంలో మహిళల అభ్యున్నతికి పాటుపడ్డ కొద్ది మందిలో దివంగత ఎన్టీ రామారావు ఒకరని ఎంపీ అశోక్‌గజపతిరాజు అన్నారు. గురువారం ఇక్కడ మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న వ్యవస్థలను చైతన్యపరచిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో గాంధీ ఆశ్రమం ఉండేదన్నారు. రాజకీయ రిజర్వేషన్లు, వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మాండలిక వ్యవస్థకు కూడా ఆయన శ్రీకారం చుట్టారన్నారు.