విజయనగరం

సమస్యల పరిష్కారానికి చర్యలు: ఆర్డీఓ సుదర్శనదొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), జూన్ 22: సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని మండల ప్రత్యేక అధికారి, పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి సుదర్శనదొర అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ టి అమ్మడమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న అన్ని పంచాయతీలతోపాటు మధుర గ్రామాల్లో ఏమైన సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికే ఇటువంటి సమావేశాలు దోహదపడతాయన్నారు. అధికారులకు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఈమేరకు పారాది, అలజంగి సర్పంచ్‌లు అల్లాడ భాస్కరరావు, బెవర సూర్యనారాయణలు మాట్లాడుతూ మరుగుదొడ్లును నిర్మించి నెలలు గడుస్తున్న ఎప్పుడు బిల్లులు చెల్లిస్తారని ప్రశ్నించారు. లబ్ధిదారులు అప్పులు చేసి మరీ మరుగుదొడ్లును నిర్మించిన ప్రయోజనం చేకూరడం లేదన్నారు. తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ రామకృష్ణరాజు మాట్లాడుతూ మరుగుదొడ్లు బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం రంగరాయపురం సర్పంచ్ చొక్కాపు నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లును ఏర్పాటు చేస్తున్న వాటిని పరిశుభ్రం చేసేవారు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాలలకు మరుగుదొడ్లును శుభ్రం చేసే స్వీపర్లును నియమించాలని కోరారు. వివిధ సమస్యలపై ఆయాశాఖల అధికారుల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సిహెచ్ నీరజ, ఇతరశాఖాధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
రైతులకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేయాలి
కొమరాడ, జూన్ 22: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన వరి విత్తనాలు సకాలంలో అందకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. ఈమేరకు స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో గల వివిధ గ్రామాల్లో ప్రకృతి అనుకూలించినప్పటికీ పంటలకు సాగుకు అవసరమైన వరి వంగడాలను అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విత్తనాల కోసం పలు గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నప్పటికీ విత్తనాలు అందడం లేదన్నారు. ఇప్పటికైన రైతులకు అవసరమైన 1001, ఆర్‌జిఎల్, తదితర రకాల వరి విత్తనాలను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.