విజయనగరం

పంటలమార్పిడి పద్దతులు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జూన్ 22: పంటలమార్పిడి పద్దతులు రైతులు పాటించాలని విజయనగరం రైతు శిక్షణాకేంద్రం ఎడి ఎఎల్.విజయ కోరారు. శుక్రవారం మండలంలోని బిళ్లలవలస గ్రామంలో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక 2018-19 పై రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏళ్ళతరబడి ఒకేరకం వరిని సాగు చేయడం ద్వారా చీడపీడల ఉధృతి పెరగడంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారని అన్నారు. రైతులు ఎంటియు 1001 బదులు ఎంటియు 1156 వంటి రకాలు సాగు చేసుకోవాలని సూచించారు. వరిలో విత్తనాలు వేసే ముందు జీవ సంబంధిత సిలీంద్ర నాశిని సూజోయోనాస్ ఫ్లోరాన్సిస్ కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల వంతున విత్తన వేసి విత్తన శుద్ధి చేసుకోవడం వలన తెగుళ్ళును తగ్గించుకోవచ్చు అని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగం తగ్గించుకోవాలని అన్నారు. దీనివలన వాటిని తిన్న వారికి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెప్పారు. జీవ వృక్ష సంబంధిత ఎరువులు,కషాయాలు వాడి నివారించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర, రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి చంద్రకళ, బిళ్ళలవలస మాజీ సర్పంచ్ నెట్టి ఆనందరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణమూర్తి, సంతోష్ కుమార్, బహుళ ప్రయోజన విస్తరణ అధికారి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల విగ్రహప్రతిష్ఠ
కొత్తవలస, జూన్ 22: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కళ్ళేపల్లి-రేగ శ్రీగృహ లింగేశ్వరస్వామి వారి కొండ వద్ద పుష్కరిణికి ఎదురుగా శివపార్వతుల విగ్రహాలను ఎస్.కోట నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త కె.బి. ఎ.రాంప్రసాద్ ప్రతిష్ఠించారు. రేగ గ్రామస్తుల సహకారంతో మాజీ ఎంపీటీసీ రావాడ ఈశ్వరరావు, సర్పంచ్‌లు యడ్ల ఈశ్వరరావులు కలసి గృహ లింగేశ్వరస్వామి పుష్కరిణి వద్ద వినాయక, శివలింగం, కుమారస్వామి విగ్రహాలతోపాటుగా శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఇక్కడ జనవరి నెలలో తీర్థ మహోత్సవం, కార్తీక మాసంలో శివారాధన మహోత్సవాలు జరుగుతాయి. సుమారు మూడు జిల్లాల నుండి భక్తులు వస్తుంటారు. పుష్కరిణిని భాగా అభివృద్ధి చేయాలని రాంప్రసాద్ కోరారు. అందుకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. స్వామి పుష్కరిణి వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమణమూర్తి, జడ్పీటీసీ ఈశ్వరరావు, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.