విజయనగరం

బాలికా విద్యాభివృద్ధి బాబు ద్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూన్ 22: బాలికావిద్యాభివృద్దే ముఖ్యమంత్రి చంద్రబాబు ద్యేయమని స్ధానిక ఎంపిపి గంట్యాడ శ్రీదేవి అన్నారు. శుక్రవారం గజపతినగరం ఎస్సీ బాలికల వసతిగృహంలో బాలికలకి బెడ్‌షీట్స్, దుస్తులను ఎంపిపి శ్రీదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో పధకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. బాలికలను అన్నిరంగాలలో ముందంజలో ఉంచేందుకు బాబుకృషి చేస్తున్నారని తెలిపారు. బాలికలు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. విద్యార్ధినిలకు చదువుతోపాటు నైతికవిలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలన్నారు. ఎంపిటిసి కర్రి శ్రీదేవి మాట్లాడుతూ బాలికలు బాగాచదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. గజపతినగరం సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి మాట్లాడుతూ బాలికలు టెలివిజన్లు, సెల్‌ఫోన్లుకు దూరంగా ఉండి శ్రద్దగా చదువుకుని ఎదగాలన్నారు. కార్యక్రమంలో వసతిగృహం సంక్షేమ అధికారిణి డి.రాధామణి తదితరులు పాల్గొన్నారు.

భారీ అన్న సమారాధాన
గజపతినగరం, జూన్ 22: సీతారామ శ్రీనివాస ఆలయం ఆవరణలోశుక్రవారం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామక్షేత్రం చతుర్ధి బ్రహ్మోత్సవాలు ముగింపుసందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు వేయిమందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపారు. సత్యసాయి సేవాసమితి సీనియర్ నాయకులు పొట్టా శ్రీనివాసరావు, మెట్ట సత్యనారాయణ, సీతారామ శ్రీనివాస సేవాసంఘం సభ్యులు మెట్ట సత్యనారాయణ, కర్రి శ్రీనివాసరావు తదితరులు అన్నసమారాధన కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, ఎంపిటిసి కర్రి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.