విజయనగరం

సాదాబైనాలపై విస్తృత ప్రచారం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి,జూన్ 22: గ్రామాలలో రైతుల వద్ద ఉన్న సాదాబైనాల ఆన్‌లైన్ చేయడంపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం జెసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రైతులకు మేలు చేకూర్చేందుకు సాధాచైనా మాలలను క్రమబద్ధీకరిస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం వరం లాంటిదని అన్నారు. అయితే సాధాచైనా మాల విషయమై గ్రామాలలో అన్ని మార్గాలలో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఐదు ఎకరాల మెట్టు, రెండున్నర ఎకరాల పల్లం ఉన్న వ్యవసాయ దారులకు మాత్రమే సాధాచైనామాల క్రమబద్ధీకరణకు అర్హులని అన్నారు. రెవెన్యూ సదస్సులు వేదికగా చేసుకుని రైతులకు, ప్రజలకు మరింత అవగాహన పెంచాలని జాయింట్ కలెక్టర్ తహశీల్దార్ బాపిరాజును, ఉప తహశీల్దార్ కె.శ్రీనివాసరావులకు సూచించారు. రెవెన్యూ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని అన్నారు. మండల కేంద్రమైన బొండపల్లికి రెగ్యులర్ వి ఆర్వోల లేరని విలేఖరులు జెసి దృష్టికి తేడీ ఇందుకు సంబంధించి నివేదిక పంపాల్సిందిగా తహశీల్దార్ బాపిరాజును ఆదేశించారు. మండలంలో రెవెన్యూ క్లస్టర్ ఉన్నప్పటికీ సరిపడ వి ఆర్వోలు లేరని తహశీల్దార్, ఉపతహశీల్దార్ జెసి దృష్టికి తీసుకువచ్చారు. మరికొద్ది రోజుల్లో మండలానికి వి ఆర్వోలను కేటాయించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి కంప్యూటర్ గదిని పరిశీలించారు. కంప్యూటర్ ఆపరేటర్లు ప్రవీణ్, పద్మలను సిఎం డ్యాష్ బోర్డులో పెండింగ్‌లో ఫైలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సిఎం డ్యాష్ బోర్డులో జీరోగా ఉన్నదని వారు బదులిచ్చారు.
విద్యుత్ చౌర్యం చేస్తే చర్యలు తప్పవు
* విజిలెన్స్ విద్యుత్ డిఇ విజయ్‌ప్రతాప్
గజపతినగరం, జూన్ 22: విద్యుత్ చౌర్యంచేసిన వినియోగదారులపై చర్యలు తప్పవని విద్యుత్ విజిలెన్స్ డిఇ విజయ్‌ప్రతాప్ హెచ్చరించారు. శుక్రవారం గజపతినగరం విద్యుత్ సబ్ డివిజన్‌లో ప్రత్యేక తనిఖీ బృందాలతో పలు మండలాల్లో పర్యిటించి వినియోగదారులపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి వారం ఐదు జిల్లాల బృందాలు పర్యటించి విద్యుత్ చౌర్యంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అపరాధ రుసుం విధిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో 20 కేసులు నమోదు చేయగా సుమారు 50వేల రూపాయలు అపరాధ రుసుం విధించారని చెప్పారు. 19 మంది వినియోగదారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడగా ఒకరు ఒకదానికి బదులు ఒకటి వాడడం జరిగిందని అన్నారు. విజయనగరం డివిజ్‌లోని గజపతినగరం, ఎల్.కోట, మెంటాడ, నెల్లిమర్ల, డెంకాడ తదితర మండలాల్లో ఏడు బృందాలు పర్యటించాయని చెప్పారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి విజిలెన్స్ విద్యుత్ బృందాలు వచ్చారని చెప్పారు.

అధికధరలకు విక్రయిస్తే చర్యలు
* గజపతినగరం సబ్ డివిజన్ సహాయ సంచాలకురాలు అన్నపూర్ణ
గజపతినగరం, జూన్ 22: ఎరువులు, విత్తనాలు వ్యాపారులు నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పదని గజపతినగరం సబ్‌డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు ఆర్.అన్నపూర్ణ హెచ్చరించారు. శుక్రవారం స్ధానిక సబ్‌డివిజన్ కార్యాలయంలో ఆత్మ ఆధ్వర్యంలో ఖరీఫ్ ప్రణాళిక, ఎరువుల వ్యాపారాలుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే నెల సీడ్స్ పాతధరలకే విక్రయించాలన్నారు. జూన్ నెల వచ్చిన విత్తనాలు కొత్త్ధరలకు విక్రయించుకోవచ్చనన్నారు. పాత స్టాక్‌ను కొత్త్ధరలకు విక్రయించినట్లు తేలితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు విక్రయాలు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. 2018-19 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూపొందించిన ప్రణాళికను ఈ సందర్బగా వివరించారు. ప్రతీ నెల 15వతేదీన ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వ్యాపారులు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా రైతులకు సహకరించాలని సూచించారు. రైతులు పంటమార్పిడి విధానాన్ని అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో దత్తిరాజేరు మండల వ్యవసాయ అధికారి కె.గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.