విజయనగరం

లోక కల్యాణానికే కల్యాణ మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూన్ 23: లోక కల్యాణానికే అమ్మాభగవాన్ కల్యామహోత్సవాలు నిర్వహిస్తున్నామని అమ్మాభగవాన్ విజయనగరం జిల్లా ఇన్‌చార్జ్ శ్యామల దాసజీ అన్నారు. శనివారం స్ధానిక కల్క్భిగవాన్ ఆలయంలో శ్యామలదాసజీ పర్యవేక్షణలో అమ్మాభగవాన్ కల్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక కల్యాణర్ధం ఇంతవరకు పనె్నండు మండలాలలో కల్యాణమహోత్సవాలు నిర్వహించామన్నారు. నెలాఖారులోగా అన్నిమండాలలో కల్యాణ మహోత్సవాలు జరుపుతామని చెప్పారు. ఇదిలా ఉండగా తమ సంఘం సభ్యులు నేత్ర వైద్యశిభిరాలు, వస్తద్రానాలు, అన్నసమారాధన కార్యక్రమాలతోపాటు ఆయుర్వేద శిభిరాలు జరపుతున్నామని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మానవుని జీవితం యాంత్రీకరణగా మారిందని అన్నారు. ప్రతీరోజూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక రంగానికి కేటాంయించాలన్నారు. కల్యాణ మహోత్సవానికి ముందు అమ్మభగవాన్ గీతాలాపనతో హోరెత్తించారు. కార్యక్రమంలో కన్వీనర్ ఆరిశెట్టి శ్యామల, పొట్టా కామేష్, కలగర్ల శంకరమహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
గజపతినగరం, జూన్ 23: నిరుపేద కుటుంబానికి దుస్తులు, ఆర్ధిక సహాయం అందజేసిన విషయం ఎం.వెంకటాపురం గ్రామంలో జరిగింది. గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురానికి చెందిన కొట్టక్కి గౌరీశంకరరావు, ఆదిలక్ష్మి దంపతులు ఆర్ధికలేమితో కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి గౌరీశంకరావు అనారోగ్యంతో మంచాన పడి ఉండగా, తల్లి అమాయకురాలు కావడంతో అర్ధాకలితో ఆ కుటుంబం అలమటిస్తున్నారు. దీనికితోడు ఈనెల 30వతేదిన కుమార్తె స్వాతి వివాహం జరగనున్నది. ఈ సంగతి తెలుసుకున్న ఇదే మండలానికి చెందిన ములకల గుమడామం గ్రామానికి చెందిన బైరెడ్డి పాపినాయుడు కుమారుడు సత్యనారాయణ శనివారం ఆ గ్రామానికి వెళ్లి ఆ కుటుంబానికి చీరలతోపాటు రెండువేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ప్రతీ ఏడాది నిరుపేదలకు వస్తద్రానం చేస్తుంటానని తెలిపారు.