విజయనగరం

ప్రభుత్వ కోనేటిబందలో పార్టీ కార్యాలయమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూన్ 23: గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోసూర్యమహల్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ కోనేటిబందలో అధికార పార్టీకి చెందిన కార్యాలయం కోసం శుక్రవారం ఆపార్టీ నాయకులు శంకుస్ధాపన చేయడం ఎంతవరకు సమంజసం అని వైకాపా నాయకులు ప్రశ్నించారు. టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయం కోసం బందలో పొక్లెయినర్‌తో గొయ్యిని త్రవ్వి శంకుస్ధాపన చేసిన ప్రాంతాన్ని ఆపార్టీ నాయకులు పరిశీలించారు. చెరువులు, బందలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వమే ఒకవైపు చెబుతూ దౌర్జన్యంగా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఎలా శంకుస్ధాపన చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు ఒక నీతి ఇతరులకు ఇంకొక నీతా అన్నారు. ప్రభుత్వం పార్టీ కార్యాలయాలు నిర్మాణం కోసం ప్రజలకు అభ్యంతరంలేని ప్రభుత్వ స్ధలాలను గుర్తించి తహశీల్ధార్‌కు ధరఖాస్తు చేసుకొని మార్కెట్ ధర చెల్లించిన తరవాత నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారన్నారు. ఇలా నిబంధనలు తుంగలో తొక్కి రెవెన్యూ అధికారులకు ఎటువంటి ధరఖాస్తు చేసుకోకుండా నిర్మాణాలు కోసం శంకుస్ధాపన చేయడం తగదన్నారు. ఈ బందతోపాటు చుట్టూ ప్రక్క స్ధలాన్ని దశాబ్ధాలుగా గ్రామానికి చెందిన పల్లంటి కృష్ణ అనే రైతు ఆధీనంలో ఉందన్నారు. అలాగే గ్రామంలో ఇళ్లస్ధలాలు లేని పేదలు ఎంతోమంది ఉన్నారని వారికి స్ధలాలు ఇవ్వకుండా కార్యాలయం కోసం శంకుస్ధాపన చేయడం తగదన్నారు. దీనిపై తహశీల్ధార్‌కు, జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేస్తామని అలగే ఆందోళన చేపట్టడానికి అయినా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గార తౌడు, వైకాపా మండపార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, పి ఎసి ఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, మాజీ ఎ ఎంసి చైర్మన్ పల్లి సంజీవరావు, వైకాపా నాయకులు మండల సరేష్, ఉత్తరావిల్లి అప్పలనాయుడు, బెల్లాన త్రినాధరావు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి ప్రణాళికలు అవసరం
గజపతినగరం, జూన్ 23: గ్రామ అభివృద్ధికి తప్పనిసరిగా ప్రణాళికలు అవసరమని ఇవొపి ఆర్‌డి జి.జనార్ధనరావు అన్నారు. శనివారం మండలంలోని పురిటిపెంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మండల సరేష్ అధ్యక్షతన ప్రణాళిక సమావేశం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యతక్రమంలో గ్రామంలో చేపట్టాల్సిన పనులను గుర్తించి అందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయడం ద్వారా పనులు చేపట్టే అవకాశం ఉందన్నారు. పంచాయతీకి వచ్చే నిధులతోపాటు అయ్యే ఖర్చు ఇంకా ఎంత లోటు ఉందో ఈ ప్రణాళికలు తయారు చేయడం ద్వారా ఒక స్పష్టత వస్తుందన్నారు. అభివృద్ధికి ప్రణాళిక లేకుంటే అభివృద్ధి కుంటుపడిపోయి గ్రామం అన్ని రంగాలలో వెనుకపోతుందన్నారు. ప్రభుత్వం గ్రామాలు వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి నిధులు విడుదలకోసం ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పురిటిపెంట-2 ఎంపిటిసి వైకుంఠం మైధిలీ ప్రియాంక, ఉపసర్పంచ్ మంత్రి నరిసింగరావు, వి ఆర్వోలు ఎన్.అసిరవోడు, ఎల్.శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.