విజయనగరం

ప్రైవేటు విద్యా వ్యవస్థ దోపిడీకి అడ్డుకట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 23: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యా వ్యవస్థ దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. శనివారం ఇక్కడ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. పేదలు కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విధంగా ఫీజులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాక్షరభారత్‌కు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్రం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు లేఖలు రాసిందని, మిగిలిన రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాకపోవడం వల్ల వారిని తొలగించారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి విషయాన్ని రాజకీయ దృష్టితో చూడటం వల్లనే పరిస్థితి ఇలా ఉందన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మూతపడ్డ నాలుగు జ్యూట్ మిల్లులను తెరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. 2004కి ముందర ఈ మిల్లులు మూతపడగా ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని తెరిపించిందని గుర్తు చేశారు. ఇపుడు కూడా మిల్లులు మూతపడ్డాయని వాటిని వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నారుూ బ్రాహ్మణులు కనీస వేతనాలు ఇమ్మని కోరితే తోక కట్ చేస్తానని సీఎం మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవ హక్కులకు భంగం కలిగే విధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. జిల్లాకు ఎస్‌డిపి నిధులు రూ.50 కోట్లు మంజూరు చేయగా దానితోనైనా మంచినీటి సమస్యను పరిష్కరించారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో సామాజిక న్యాయం ఉంటుందన్నారు. అంత్యొదయ అన్నదే తమ లక్ష్యమన్నారు. ఎపికి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రెండేళ్లు ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కింద ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తే సరిపోతాయని అంతకంటే ఎక్కువ ఇస్తే మార్జిన్ మనీ చెల్లించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబితే అంతకంటే ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16500 కోట్లు చెల్లించామన్నారు. కాగా, దీనిలో 30శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇమ్మని అడిగితే కేంద్రం ఎక్స్‌టెర్నల్ ఏజన్సీకి ఇచ్చినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం కుదరదని దానికి ఎఫ్‌ఆర్‌బిఎం రూల్స్ అడ్డంకిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర పదాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి, పివివి గోపాలరాజు, ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు నిమ్మక జయరాజ్, రాష్టక్రార్యదర్శి పైడి వేణుగోపాల్, దార సాంబయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ రఘురాం, ఆర్‌డి విల్సన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, పట్టణ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, పి.సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.