విజయనగరం

అవినీతిని నిరూపించలేకపోతే జైలుకెళ్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 23: మేం చెప్పేవి వాస్తవాలు.. చంద్రబాబు చెప్పేవి అవాస్తవాలు.. మేం మిత్ర ధర్మంతో మాట్లాడుతున్నాము.. కేంద్రం మంజూరు చేసే ప్రతి పథకంలోను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిని నిరూపించలేకపోతే తాను జైలుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సవాల్ విసిరారు. శనివారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన గృహనిర్మాణ పథకానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్, నీరు చెట్టు, పంట కుంటలు, ముద్ర రుణాలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి వంటి పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తే పట్టిసీమకు నిధులు మళ్లించారని విమర్శించారు. ఈ విధంగా డబ్బు మాది..అవినీతి వారిదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలకు నిధులు కేటాయింపు చేయలేదు కదా అని విలేఖరులు అడగ్గా ప్రతి దానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఉండవని బదులిచ్చారు. చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతున్నారని మీరే చెబుతున్నప్పుడు కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించగా కేంద్రం నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు తమ నిజాయితీని నిరూపించుకునేందుకు సిబిఐ ఎంక్వైయిరీ వేయమని వారే కోరేవారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకునేందుకు తనపై ఎంక్వైరీ వేయమని కోరవచ్చని అన్నారు. ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేసి విజయకేతనం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర పదాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి, పివివి గోపాలరాజు, జాతీయ యువమోర్చా అధ్యక్షుడు నిమ్మక జయరాజ్, ధారా సాంబయ్య, ఆర్‌డి విల్సన్, రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.