క్రైమ్/లీగల్

మిస్సింగ్ మిస్టరీ చేధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, జూలై 16: స్థానిక పోలీసులు మిస్సింగ్ మిస్టరీ చేధించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రెల్లిగౌరవమ్మపేట గ్రామానికి చెందిన పి.మహేశ్వరి అనే అమ్మాయి గత నెల 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందని తండ్రి రామారావు ఎల్.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి అమ్మాయి ఆచూకీ కోసం గాలింపులు జరపగా కొత్తవలస మండలంలోని లక్కీ డాన్స్ గ్రూప్ సభ్యుల వద్ద ఉందని తెలియడంతో తల్లిదండ్రులతో కలసి ఎస్సైశ్రీనివాస్ వెళ్ళి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈమె డాన్స్ మీద ఉన్న ఇష్టంతో డాన్స్ నేర్చుకునేందుకు వారి వద్దకు వెళ్లిపోయానని, ఇంట్లో చెబితే ఒప్పుకోరని, చెప్పకుండా వెళ్లిపోయానని ఆమె చెప్పిందని ఎస్సై శ్రీనివాస్ అన్నారు. అమ్మాయి దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.