విజయనగరం

అలజంగిలో అధికారుల సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), జూలై 21: మండలం అలజంగి గ్రామంలో డయేరియాతో బాధపడుతున్న రోగులను జిల్లాస్థాయి అధికారులు శనివారం పరిశీలించారు. ‘అలజంగిలో డయేరియా విజృంభన- ఒకరు మృతి’ ఆంధ్రభూమిలో శనివారం వచ్చిన కథనానికి స్పందించారు. జిల్లా పంచాయతీ అధికారి బి సత్యనారాయణ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి, ఇఇ గాయత్రీదేవితోపాటు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎంఎం రవికుమార్ రెడ్డిలు అలజంగి గ్రామంలోని పలువీధుల్లో పర్యటించారు. డయేరియా ఏవిధంగా సోకింది, తదితర వివరాలను గ్రామస్థులను అడిగితెలుసుకున్నారు. చెత్తాచెదారాలు గ్రామాల్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని సంబంధిత పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంచినీటి కుళాయిల వద్ద అపారిశుద్ధ్యం తాంఢవించకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న పదార్థాలను వినియోగించరాదన్నారు. ఎప్పటికప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. చెత్తాచెదారాలను చెత్తకుండీలలో వేయాలని, కాలువలు, రోడ్లుపై వేయరాదన్నారు. వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు వేడి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పందులు, కుక్కలు గ్రామాల్లో స్వైరవిహారం చేయకుండా చర్యలు చేపట్టాలని ఇఓపీఆర్‌డీ రాజుకు ఆదేశించారు. డయేరియా అదుపులో ఉన్నంతవరకు వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తామని డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయలక్ష్మి తెలిపారు. మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకుని సిబ్బంది సక్రమంగా విదులు నిర్వహించాలని ఆదేశించారు. పక్కి పిహెచ్‌సీ వైద్యాధికారి ప్రజ్ఞను స్థానికంగా నివాసం ఉండి వైద్యసేవలందించాలన్నారు. అదేవిధంగా శనివారం నాటికి డయేరియా అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కేసులు నమోదుకాలేదని స్పష్టం చేశారు. గ్రామంలో అన్నివీధుల్లో బ్లీచింగ్, ఫినాయిల్స్‌ను పూర్తిస్థాయిలో జల్లించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏదీ ఏమైన అలజంగి గ్రామంలో డయేరియా విజృంభించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురికావడం విశేషం. అయితే జిల్లా అధికారులు గ్రామానికి రావడంతో కొంతవరకు సమస్యలు పరిష్కారమయ్యాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి గణపతిరావు, ఎంపీడీఓ కె రామకృష్ణరాజు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఇ పీఎంకె రెడ్డి, సర్పంచ్ బెవర సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు.