విజయనగరం

మంత్రికి చేరిన ఇసుక పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,జూలై 21: జిల్లాలో సంచలనంగా మారిన ఇసుక అక్రమ రవాణాదారులకు భారీ జరిమానా తహశీల్దార్ విధించిన సంగతి తెలిసిందే. ఇసుక ట్రాక్టర్లను ఒక వేళ పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు పట్టుకున్నా ఐదువేలు, పది వేలు జరిమాన విధించి వదిలివేయడం పరిపాటి. కానీ ఈ స్థాయిలో భారీగా లక్ష రూపాయల వంతున జరిమానా విధించారు. అంతమొత్తం తాము కట్టలేమని ట్రాక్టర్ల యజమానులు తెగేసి చెప్పడంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. పట్టుబడిన ట్రాక్టర్లలో చాలా వరకు అధికార పార్టీకి చెందినవారివే కావడం విశేషం. ఈ నెల 16న సీతారాంపురం గ్రామం వద్ద అర్థరాత్రి సమయంలో ఇసుకను అనధికార రీచ్ నుండి తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని జరీమానా విధించడం కోసం తహశీల్దార్‌కు అప్పగించారు. తహశీల్దార్ శేషగిరిరావు నూతన ఇసుక పాలసీ ప్రకారం లక్ష రూపాయల వంతున జరీమానా విధించి ఆర్డీవొకు జరీమానా చెల్లించాల్సిందిగా ట్రాక్టర్లయజమానులకు నోటీసులు జారీ చేశారు. ట్రాక్టర్లు పట్టుకుని ఏడు రోజులు కావడంతో అంత మొత్తం జరీమానా కట్టలేమని ట్రాక్టర్ల యజమానులు 20వేలకు మించి కట్టలేమని అధికారులు వద్ద చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు కూడా ట్రాక్టర్ల యజమానులు కలవగా ఆర్డీవొతో మాట్లాడారు. జరీమానా విధించినందున తాము ఏమీ చేయలేమని చెప్పారని తెలిసింది. ఆర్డీవొను నేరుగా ట్రాక్టర్ల యజమానులు కలసి జరీమానా అంత చెల్లించుకోలేమని చెప్పగా జరీమానా చెల్లిస్తేగానీ ట్రాక్టర్లు విడుదల చేసే పరిస్థితిలేదని సమాచారం. చివరి హస్త్రంగా ట్రాక్టర్లయజమానులు శనివారం రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును కలసి లక్ష రూపాయలు జరీమానా కట్టలేమని, జరీమాన తగ్గించేందుకు కృషి చేయాలని కోరడానికి వెళ్తాలమని తెలిపారు. ఈ వ్యవహారం చుట్టూ తిరిగి మంత్రి వద్దకు చేరింది. మరీ అధికారులు విధించిన జరీమానాను అమలుచేస్తారా, లేక మంత్రి జరీమానా తగ్గించే ప్రయత్నం చేస్తారా అన్న విషయం తేలనుంది. ఇంత భారీగా జరీమానా విధించడంతో మండలంలో ఈ వ్యవహారాం చర్చీనీయాంశం అయింది.

మంచినీటి సమస్యపై అధికారులను నిలదీసిన వార్డు కౌన్సిలర్లు
* ఇన్‌ఫిల్టర్ వెల్స్‌లో నీరు లేక సమస్య ఉత్పన్నం
బొబ్బిలి, జూలై 21: పురపాలక సంఘం పరిధిలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోందని, దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే నీటి సరఫరాకు యుద్ధప్రతిపాదికపై చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వార్డు కౌన్సిల్ సభ్యులు తెంటు పార్వతి, శ్రీ్ధర్, శరత్, అకుంలు మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి సమస్య అస్తవ్యస్థంగా ఉందని, నెలకు ఐదారుసార్లు మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఛైర్‌పర్సన్ అచ్యుతవల్లి జోక్యం చేసుకుని భోజరాజపురం వాటర్ వర్క్స్ వద్ద ఉన్న ఇన్‌ఫిల్టర్ వెల్స్‌లో నీరు లేదని, నది వద్ద బురదమట్టి పేరుకుపోయిందన్నారు. దీన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే డీఇ మహేష్ మాట్లాడుతూ పూర్తిగా వాటర్ లేకపోవడంతో మోటార్లు పనిచేయడం లేదని, దీంతో సరఫరా చేయలేకపోతున్నామన్నారు. ఇందుకు కౌన్సిల్ సభ్యులు జోక్యం చేసుకుని కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నప్పటికీ నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకుల ద్వారా నీటిసరఫరాను ఎందుకు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఇన్‌ఫిల్టర్ వెల్స్‌లో కింద రాళ్లతో ప్లెగింగ్ చేస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదని, నీటి సరఫరా విషయంలో అధికారులు, సిబ్బంది ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. ఇందుకు ఛైర్‌పర్సన్ జోక్యం చేసుకుని ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్‌ప్లానింగ్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ నీటి సరఫరాతోపాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే పెద్దగెడ్డ నీటిని రప్పించేందుకు జిల్లా అధికారులతోచర్చించాలని వైస్ ఛైర్మన్ సిహెచ్ రమేష్‌నాయుడు కోరారు. వీటితోపాటు మరికొన్ని అంశాలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. అనంతరం అజెండాను ఆమోదించారు.