విజయనగరం

ఆలస్యంతో అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 2: అసలే రెండుగంటల ఆలస్యంగా జన్మభూమి బహిరంగ సభ ప్రారంభం.. ప్రజల సమస్యలు తెలుసుకోవడంకన్నా ప్రభుత్వ పథకాలపై అధికారులతో చెప్పించటానికే ముఖ్యమంత్రి ఎక్కువ సమయాన్ని కేటాయించటంతో శనివారం జరిగిన బొండపల్లి జన్మభూమి బహిరంగ సభకు హాజరైన ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తొలుత నిర్ణయించిన ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 11గంటలకు బొండపల్లికి చేరుకోవాలి. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, స్టాళ్ల సందర్శన, యూనిట్ల పంపిణీ చేసి జన్మభూమి గ్రామసభ నిర్వహించవలసి ఉంది. కానీ సుమారు గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12.30కు బొండపల్లికి చేరుకున్నారు. జన్మభూమి గ్రామసభ వేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి వివిధ పథకాల కింద మంజూరు చేసిన యూనిట్లను లబ్ధిదారులకు అందజేసారు. అదే విధంగా జిల్లాలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులకు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి లాంఛనంగా శంకుస్థాపన చేసారు. వేదికపైకి సిఎం చేరుకునే సరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ప్రార్థనాగీతం, జ్యోతిప్రజ్వలన అనంతరం ముఖ్యమంత్రి వేదికపైన ఉన్న ప్రజాప్రతినిధులు, జన్మభూమి గ్రామసభకు హాజరైన ప్రజలతో జన్మభూమి ప్రమాణం చేయించారు. అనంతరం గ్రామసభను ప్రారంభించి గ్రామసమస్యలపై అధికారుల నుంచి సమాచారం అడగటం ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అధికారులను మందలించిన సిఎం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అడంగల్ విషయంలో, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కొందరు రైతులు ముఖ్యమంత్రికి తమ సమస్యలను తెలిపారు. ఇదే సమయంలో గ్రామస్థులు వివిధ సమస్యలతోపాటు పెన్షన్లు, ఇళ్లస్థలాలు, ఇళ్ల మంజూరు తదితర అంశాలను ముఖ్యమంత్రి వద్ద ఏకరువు పెట్టేందుకు సన్నద్ధం అవుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి హఠాత్తుగా ఫిర్యాదులు వినే పర్వాన్ని ఆపివేసి అధికారులతో ప్రభుత్వ పథకాలు, గ్రిడ్లు, మిషన్లు తదితర అంశాలపై ఉపన్యాసాలు ఇప్పించారు. కస్తూరిభా పాఠశాలకు చెందిన స్వాతి అనే విద్యార్థిని చంద్రబాబు పాలనలో అమలవుతున్న కార్యక్రమాలపై 10నిముషాల ఉపన్యాసం ఇచ్చింది. ఆ తరువాత గరివిడికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఢిల్లీ ఇన్‌స్పైర్‌లో తాము ప్రదర్శించిన ఎగ్జిబిట్లను చంద్రబాబు సమక్షంలో తిరిగి ప్రదర్శించారు. ఈ విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించారు. వేదికపైన ఉన్న బొండపల్లి జడ్పీటిసిని దత్తత తీసుకున్న బొండపల్లి గ్రామంలో ఏఏ కార్యక్రమాలు చేపట్టారని ముఖ్యమంత్రి అడిగితే, ఆయన ఏకధాటి ప్రసంగానికి చంద్రబాబు ఛలోక్తి విసిరారు. గ్రామసర్పంచ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా సమస్యల గురించి, గ్రామానికి కావలసిన పథకాల గురించి కాకుండా చంద్రబాబు పొగడ్తలకే పరిమితమయ్యారు. గ్రామానికి ఏమి కావాలి అని ముఖ్యమంత్రి ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పలేకపోయారు. అప్పటికే మధ్యాహ్నం రెండుగంటలు దాటడం, ముఖ్యమంత్రి తమ వినతులను పట్టించుకునే పరిస్థితి లేకపోవటంతో గ్రామసభకు హాజరైన జనం ఒకొక్కరుగా బయటకు వెళ్లిపోవటం కనిపించింది. ఇది గమనించి అధికారులు, పోలీసులు వారిని నివారించేందుకు ప్రయత్నించినా నిష్క్రమణ కొనసాగుతు వచ్చింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సుమారు 45నిముషాలపాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు. సుమారు 18నెలల పాలనలో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను వివరిస్తూ వచ్చారు. పనిలోపనిగా విభజన విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌పై, రాష్ట్రాన్ని దోచుకుతిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. సమస్యలపై అధికారులను ముఖ్యమంత్రి నిలదీసిన సందర్భంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రసంగం సందర్భంలో లేకుండా పోయింది.

ఇన్‌ఛార్జి పాలనతో ఇబ్బందులు
గజపతినగరం, జనవరి 2: జిల్లాలో మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలు పర్యవేక్షించేందుకు పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని జిల్లా మాజీ సైనిక ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇన్‌ఛార్జిగా ఉన్న సత్యారావును పూర్తి స్థాయి అధికారిగా నియమించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో సైనిక భవన్ శిథిలావస్థలో ఉందని సైనిక ఉద్యోగులకు ఆరామ్ భవన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మాజీ సైనిక ఉద్యోగుల చైర్మన్ కలెక్టర్ సంక్షేమం గురించి గత 15 ఏళ్ల నుండి ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించలేదని అన్నారు. జిల్లాలో గల మాజీ సైనిక ఉద్యోగుల వితంతువులు, యుద్దవీరుల భార్యలను ఆదుకోవడంతో పాటు జిల్లాలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామచంద్రరాజు, సలహాదారుడు సత్యరావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ నాయకుల అరెస్టులకు నిరసగా రాస్తారోకో
విజయనగరం (్ఫర్టు), జనవరి 2: జిల్లాలో శనివారం జరిగిన మూడవ విడత జన్నభూమిలో ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించిన సిపిఐ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సిపిఐ నాయకులు శనివారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సీనియర్ నాయకుడు వి.కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రజా సమస్యలను తెలియజేయడానికి వెళ్లాలని నిర్ణయించిన సిపిఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఎంత నియంతృత్వ పాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని కుట్ర పన్నుతున్న నేతలకు తిప్పలు తప్పవని ఆయన హెచ్చరించారు. సిసిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో జిల్లాలో పేరుకుపోయిన అనేక సమస్యలు, భోగాపురం విమానాశ్రయం, మెడికల్ కళాశాల, రాష్ట్రం విభజనలో పొందుపర్చిన అనేక అంశాలపై వినతిపత్రం ఇవ్వాలని సిపిఐ నాయకులు నిర్ణయిస్తే, తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జగన్నాధం, అప్పలరాజు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
‘రాష్ట్ర మహసభలను విజయవంతం చేయండి’
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 2: మున్సిఫల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలను విజయంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావులు విజ్ఞప్తి చేసారు. కెఎల్‌పురం సిఐటియు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరులసమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 3,4 తేదిలలో నిర్వహించే రాష్ట్ర మహాసభలో మున్సిఫల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభలు సందర్భంగా గత నాలుగేళ్లగా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ మహాసభల్లో నూతన కార్యవర్గం ఎంపిక చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభల్లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షరాలు కె.పుణ్యవతి, ఎపి మున్సిఫల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఎపి మున్సిఫల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ సమస్యల కోసం గత నాలుగేళ్లుగా అనేక ఉద్యమాలు చేపట్టినప్పటకి వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. మున్సిఫల్ పారిశుద్ధ్య పనులను ప్రాంతాలవారీగా చేపట్టేందుకు 271 జీవో ప్రకారం కాంట్రాక్టర్లకు అప్పగించడం సరికాదని, ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పోరేషన్ల సంఖ్య పెరిగినందున తగిన స్థాయిలో ఉద్యోగులను భర్తీ చేయాలని కోరారు.