విజయనగరం

స్వాతంత్య్ర సమరయోధుడుని విస్మరించిన పాలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఆగస్టు 14: భారతదేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలతో పోరాడిన స్వాతంత్య్ర యోధుడు కూనిశెట్టి వెంకటనారాయణదొరను పాలకులు విస్మరిస్తున్నారు. తెల్లదొరలను గడగడలాడించిన యోధుడు కూనిశెట్టి దొర. స్వాతంత్య్ర ఉద్యమం కాలంలో నేనుసైతం అంటూ ఆయన పోరాడారు. 1907జూలై 4న వెంకటనారాయణదొర జన్మించారు. తన 15వ ఏట నుంచే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన వనరులు ఉన్న వాటిని వదులుకుని స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో సారా వేలంపాటలు జరగకుండా ఆయన అడ్డుకున్నారు. విదేశీ వస్తు బహిష్కరణకు సహకరించారు. 1930లో విశాఖపట్టణంలో మహాత్మగాంధీ అధ్యక్షతన జరిగిన ఉప్పు సత్యాగ్రహం పోరాటంలో పాల్గొన్నందుకు ఆయన 6నెలల కఠిన కారాగారశిక్షను అనుభవించారు. 1932లో గాంధీజీ శిష్యురాలు వేదాంతం కమలాదేవి అధ్యక్షతన స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించినందుకు బ్రిటీష్ వారు ఆయన్ను అరెస్టు చేశారు. 1937లో స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తూ ప్రజలు దేశభక్తి వైపు ప్రభావితులయ్యేలా చేసినందుకు అప్పటి పార్వతీపురం డీఎస్పీ హోలండన్ దొర ఆయన్ను కొట్టి బరంపురం జైల్‌కు తరలించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే పట్టణానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోసం అనుమతులు తెప్పించారు. స్వాతంత్య్రం అనంతరం జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ఆయన ఎన్‌జిరంగా స్థాపించిన కృషికార్‌లోక్ పార్టీ తరుపున పోటీచేసి ప్రథమ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా తెల్లదొరలు బొబ్బిలి-సాలూరుమధ్య రైలుమార్గాన్ని నిర్మించారు. బ్రిటీస్‌వారు సౌకర్యార్థం రైలుమార్గం నిర్మించి తరువాత రద్దుచేశారు. నారాయణదొర ఎమ్మెల్యే అయిన తరువాత రైలుమార్గాన్ని పునరుద్దరింపచేశారు. ఒరిస్సాలోని కొరాపుట్, ఆంధ్రాలోని విశాఖకు రైలును నడిపించే ప్రణాళికను రూపొందించగా అప్పట్లో అమలుకాలేదు. తొలి ఎమ్మెల్యేగా, స్వాతంత్య్రయోధుడుగా ఆయన చేసిన సేవలు ఈప్రాంత ప్రజలు మరువరానిది. అటువంటి మహనీయుడు విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుంది. తమ సొంతఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, విగ్రహస్థాపనకు అనుమతులు ఇవ్వాలని ఆయన కుమారుడు కూనిశెట్టి జెట్టిదొర కోరుతున్నారు. 30 ఏళ్లుగా దొరకుటుంబ సభ్యులు కోరుతున్న పురపాలకులు పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు దొరలాంటి సమరయోధుని విగ్రహం ఏర్పాటు పట్ల వివక్షత చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాలకులు ప్రాధాన్యత ఇస్తున్నంత కాలం దొర లాంటి నిస్వార్థ నాయకుడికి గుర్తింపు లభించదేమోనని విమర్శిస్తున్నారు. 1983లో అప్పటి ఎమ్మెల్యే అధ్యక్షతన విగ్రహా ఏర్పాటుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా మామిడిపల్లికి వెళ్లే రహదారికి కూనిశెట్టి నారాయణదొర మార్గం అనేపేరు పెట్టాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మాణం కూడా జరిగింది. కానీ నేటికీ విగ్రహం ఏర్పాటులో పాలకులు జాప్యం చేస్తున్నారు.