విజయనగరం

పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఆగస్టు 14: ప్రభుత్వ పాఠాశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని స్ధానిక ఎంపిడివొ ఎం.ప్రకాశరావు కోరారు. మంళవారం మండలంలోని చామలవలస గ్రామంలోని ఎస్సీ ప్రాధమిక పాఠశాలలోని విద్యార్థులకు తెలుపు దుస్తులను అదే గ్రామానికి చెందిన ఒంపల్లి గ్రామ కార్యదర్శి డోల శంకరరావు ఎంపిడివొ ప్రకాశరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్ధులకు ప్రభుత్వం వౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. అయినా దాతలు తమవంతు సహాయంగా అందజేసి పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. మండల విద్యా శాఖాధికారి కూనిబిల్లి సింహాచలం మాట్లాడుతూ ప్రభుత్వం, దాతలు అందిస్తున్న సదుపాయాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి శంకరరావు సేవాదృక్పధంతో ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఇదిలా ఉండగా రాచకిండాం గ్రామంలో స్వర్గీయ చొక్కాకు మహేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 30వేల రూపాయల విలువ గల దుస్తులు, టైలు, బెల్టులు 41 మంది విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో బొండపల్లి హైస్కూల్ ప్రధానోపాద్యాయులు సన్యాసిరాజు, ఉపాధ్యాయులు బండారు మంగమ్మ, ఇవొపీఆర్డీ రవికుమార్, లగుడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి
బొండపల్లి, ఆగస్టు 14: రానున్న ఎన్నికలలో టీడీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ కృష్ణ కోరారు. మంగళవారం మండలంలోని గొట్లాం గ్రామంలో టీడీపీ మండల పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను అమలు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుంతుందని చెప్పారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు ప్రణాళికాబద్దంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రాష్ట్భ్రావృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పధకాలు ప్రజలలోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
* మండల వ్యవసాయాధికారి రవీంద్ర
బొండపల్లి, ఆగస్టు 14: ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు ప్రోత్సహించాలని స్ధానిక మండల వ్యవసాయ శాఖాధికారి కె.రవీంద్ర కోరారు. మంగళవారం మండలంలోని వెదురువాడ, జె.గుమడాం గ్రామాలలో పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రీయ ఎరువులతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చని తెలిపారు. బాస్వర సంబంధిత ఎరువులను పూర్తిగా దమ్ములోనే వేయాలని అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కొవ్వాడపేటలో బ్రహ్మాస్త్రం కషాయాన్ని ఏవిధంగా తయారు చేయాలో, ఏఏ ఆకులు ప్రయోగించి తయారు చేస్తామో చేసి చూపించారు. దీనివలన వరిలో ఆకుముడత, రసం పీల్చు పురుగుల నివారణకు ఉపమోగపడుతుందని చెప్పారు. వేపాకు, వావిలాకు, ఆముదం, తూటికాడ, తదితర ఆకులను ప్రతి ఆకు మూడు కిలోల వంతున ఐదు రకాల ఆకులను 25 కిలోలను బాగా దంచి ఐదుసార్లు పొంగు వచ్చేవరకు మరిగించి తయారు చేసుకోవాలని అన్నారు. దీనిద్వారా రైతులకు ఖర్చుతోపాటు పర్యావరణ కలుషితాన్ని తగ్గించవచ్చని తెలిపారు. జె.గుమడాం గ్రామంలో ఘనజీవామృతం తయారీ విధానం గురించితోపాటు వాటివలన కలిగే ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణమూర్తి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.