విజయనగరం

గొల్లలపాలెంలో వైద్యశిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, ఆగస్టు 14: మండలంలోని గొల్లలపాలెం గ్రామంలో మంగళవారం కొత్తవలస పిహెచ్‌సి వైద్యబృందం మెడికల్ క్యాంపు నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యురాలు కె.ఎన్.ఎం మణికుమారి ఆదేశాల మేరకు సిబ్బంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య కార్యకర్త జె.వి.ప్రసాదరావు ఆద్వర్యంలో సిబ్బంది రక్తపూతలు తీసి రోగులను పరీక్షించారు. 25 మందికి పరీక్షలు జరపగా అందులో నలుగురికి జ్వరాలు ఉన్నట్లు తేలిందన్నారు. వారికి మందులు సరఫరా చేశామని ప్రసాదరావు తెలిపారు. కాలానుగుణ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, ఫ్లాస్టిక్ వస్తువులలో నీటి నిల్వలు ఉండకూడదని తెలిపారు. నీటి తొట్టెలలో నీటి నిల్వలు వారానికో రోజు మార్చాలని చెప్పారు. దోమతెరలు వాడాలని అన్నారు. కాలువల్లో మురుగునీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ హెచ్ ఇవొ వెంకటనాయుడు, అంగన్‌వాడీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలి
కొత్తవలస, ఆగస్టు 14: టీడీపీకి చెందిన ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు కోళ్ళ శ్రీను పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికలే థ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మండలంలో 22 మందికి సుమారు నాలుగు లక్షల రూపాయల సహాయం అందించామని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిచేసిన ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనమందరం కానుకగా అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులకు ప్రజలంతా సహకరించి గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలని ఎంపీపీ రాజన్న కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి
వేపాడ, ఆగస్టు 14: మండలంలోని కేజీ పూడిలో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని బందవలస గిరిజనులు విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు చల్లా జగన్, కపాటి వెంకటరావుల ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ రమణను కలిశారు. ఈ సందర్భంగా జగన్ తహశీల్దార్‌తో మాట్లాడుతూ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని అన్నారు. అలాగే గతంలో గిరిజనులకు పట్టాలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆ భూములు పెద్దల చేతుల్లోకి మారి పోతున్నాయని చెప్పారు. 80శాతం భూములు ఇప్పటికే విక్రయాలు జరిగిపోగా ఆ భూముల్లో గల భారీ వృక్షాల సైతం నేలకొరిగిపోతున్నాయని అన్నారు. వీటిపై సమగ్ర సర్వే జరిపి పట్టాలను రద్దు చేసి అర్హులైన గిరిజనులకు ఇవ్వాలని అన్నారు. పట్టాలు లేని వ్యక్తులు ఆ భూముల మీదకు వస్తే అక్కడే వారిని నిర్భంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ రమణ భూముల అమ్మకాలపై సమగ్ర సర్వే జరిపి గిరిజనులకు న్యాయం చేస్తామని అన్నారు. అలాగే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు బందవలస గిరిజనులు స్థానిక ఎంపీడీవొ పట్నాయిక్‌ను కలసి తాగునీటి సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు. 14వ ఆర్థిక సంఘం నిదులతో అక్కడ బోరుబావి ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమం గిరిజన నాయకులు సుబ్బారావు, గంగులు, సీతారామ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పురోణీల
క్రమబద్ధీకరణకు 20 వరకే గడువు
వేపాడ, ఆగస్టు 14: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పురోణీల క్రమబద్ధీకరణకు ఈనెల 20వ తేదీ వరకే గడువు విధించడం జరిగిందని తహశీల్దార్ రమణ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలకు సమాచారం అందించేందుకు ఆటో ద్వారా ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల దరఖాస్తులు రాగా ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే 20లోగా మీ-సేవలో ఆన్‌లైన్ చేసుకోవచ్చు అని అన్నారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటే సమాచారం అందించాలని వి ఆర్వోలను ఆదేశించారు. నీటి తీరువా వసూళ్ళపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి విఆర్వో ఉదయం గ్రామాలకు వెళ్ళి విధిగా మధ్యాహ్నం మూడు గంటల వరకు తహశీల్దార్ కార్యాలయానికి చేరేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పారదర్శకంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.

ఉత్సాహంగా సాగిన ఆట, మాట, పాట
గజపతినగరం, ఆగస్టు 14: మండలంలోని లోగిశ గ్రామానికి చెందిన బండారు బాలానంద సంఘం నిర్వాహకురాలు వి.సునంద(ఖమ్మం) అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి చిన్నారులను కలసి ఆట, మాట, పాట కార్యక్రమం నిర్వహించి ఆహుతుల సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బండారు చిన రామారావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోని చిన్నారులకు తెలుగు భాషయొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకే ఆట, మాట, పాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వేపాడ, ఆగస్టు14: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోవాలని మండల దేశం పార్టీ అధ్యక్షుడు శానాపతి తాతారావు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీపీ ఛాంబర్‌లో మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గ్రామ వికాశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అందరికీ అందేలా నిర్వహిస్తున్న సాధికార సర్వేలో ఆన్‌లైన్ జరిగేలా చూడాలని అన్నారు. సమావేశంలో జిల్లా టీడీపీ నాయకుడు గోగాడ జగన్నాథం నాయుడు, ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గజపతినగరం, ఆగస్టు 14: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు గ్రామాలలో సవివరంగా తెలియజేయాలని ఎంపిపి గంట్యాడ శ్రీదేవి కోరారు. మంగళవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చంద్రబాబు అమలు చేస్తున్న పధకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్శిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికి కనీసం ఒక్క పధకం ద్వారా అయినా లబ్ధి చేకూరడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. నిరుద్యోగ భృతి గురించి యువతకు సమగ్రంగా వివరించాలని, ఇతర పార్టీలవారి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తుందో ముందుగా కార్యకర్తలు అవగాహన చేసుకోవాలని సూచించారు. వైస్ ఎంపిపి కనకల పోలినాయుడు, ఆత్మా కమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మనాయుడు, ఎ ఎంసి వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు వాసుదేవరావు, వైకుంఠం ప్రదీప్‌కుమార్, ఎంపిటిసి కర్రిశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

జానపదాలతో ప్రకృతి వ్యవసాయం
* బొంతలకోటి వినూత్న ప్రయోగం
గజపతినగరం, ఆగస్టు 14: రాష్టప్రతి అవార్డు గ్రహీత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు బొంతలకోటి శంకరరావు ప్రకృతి వ్యవసాయం కషాయాలు-ద్రావనాలపై రైతులను, ప్రజలను విద్యార్థులకు ఉపయోగపడే వ్యవసాయ వాచాకాలు రూపకల్పనలో పాల్గొన్నందుకు ఈ వ్యవసాయ వాచకాలు దేశంలో బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొంది, ఉత్తమ ఫలితాలు సాధించినందుకుగాను విజయనగరంలో జట్టు సంస్ధ, డిపిఎం యు జిల్లా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనియట్ రైతు సాధికార సంస్ధ నిర్వహణలో ఎపి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ విజయకుమార్, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకురాలు లీలావతి, డిపి ఎం బొంతలకోటిని మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జట్టు సంస్ధ అధినేత డాక్టర్ డి.పారినాయుడు నిర్వహణలో బొంతలకోటి శంకరరావు రైతులకు, సామన్య ప్రజానీకానికి అర్ధమయ్యే జానపద కళారూపాలతో వ్యవసాయ వాచకాలు, లఘచిత్రాలుగా దేశవ్యాప్తంగా మన్ననలు పొందడం బొంతలకోటి సామాజిక స్పృహకు నిదర్శనమని అన్నారు. పాటలు, బుర్రకధ, జముకుల కధ, చెక్క్భజన, కోలాటం బృంద నృత్యాలుగా బొంతలకోటి వ్యవసాయ వాచకాలు రచనలతో దేశంలో గుర్తింపు తెచ్చాయన్నారు. కార్యక్రమంలో 18 వ్యవసాయ వాచకాలు రచయితలు, వ్యవసాయ శాఖ అధికారులు స్వచ్చంద సంస్ధ ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు.