విజయనగరం

19న ‘దేశాభివృద్ధి-సైన్స్ దృక్పథం’పై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 17: జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ్భవనంలో ఈనెల 19వతేదీన ‘దేశాభివృద్ధి-సైన్స్ దృక్పథం’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధానకార్యదర్శి శశిధర్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్.రవికుమార్ ప్రసంగిస్తారని చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవిఎన్ వెంకటరావుమాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్థేశించిన శాస్ర్తియ దృక్పథాన్ని పెంచడానికి, అందుకు అడ్డుగోలుగా నిలుస్తున్న మూఢ నమ్మకాలను పారద్రోవాలని, ఇందుకోసం ప్రభుత్వాలు చట్టం చేయాలని నినదించి ఆ ఉద్యమం కోసం అసువులు బాసినప డాక్టర్ నరేంద్ర దబోల్కర్ స్మృతిగా ఆగస్టు 20వతేదీని ‘జాతీయ శాస్ర్తియ దృక్పథపుదినం’గా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఇప్పటికే జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపుఇచ్చిందని, ఆ పిలుపునకు అనుగుణంగా శాస్ర్తియ ఆలోచనా పరిధిని ప్రజల్లో పెంచడానికి జిల్లాకమిటీ కృషి చేస్తుందని తెలిపారు. దీనిలోభాగంగా ఈనెల 19వతేదీన జరిగే సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. వాల్‌పోస్టర్ల ఆవిష్కరణలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజగోపాల్, జిల్లా ముఖ్యనాయకులు ఆదిలక్ష్మి, సింహాచలం, కృష్ణారావు,సిహెచ్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన హాస్టళ్ల సరకుల పంపిణీకి టెండర్లు

పార్వతీపురం, ఆగస్టు 17: గిరిజన ఆశ్రమ, ఉన్నత పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల వంటకాలు, ఆహార పదార్థాల సరఫరాకు సంబంధించి టెండర్లను ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఐటిడి ఎ గిరిమిత్ర సమావేశం హాలులో ఏర్పాటు చేసిన టెండర్ల నిర్వహణలో భాగంగా కూరగాయలు, పండ్లు, స్వీట్స్, చికెన్ సరఫరాకు సంబంధించి నిర్వహించిన ఈ టెండర్ల కార్యక్రమానికి జిల్లాలోని పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సరకుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడేదిలేదని సరకులు సకాలంలో,సక్రమంగా పంపిణీ చేయాల్సి ఉందని పీవో అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు దాఖలు చేసిన టెండర్లను పరిశీలించి ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈటెండర్ల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ పెద్దింటి కిరణ్‌కుమార్, గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ భాస్కరరావులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన టెండరుదారులు, హెచ్ ఎంలు, ప్రిన్సిపాళ్లు, ఎటిడబ్ల్యువోలు పాల్గొన్నారు.