విజయనగరం

దేశం గర్వించదగ్గ నేత వాజ్‌పేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఆగస్టు 17: భారతదేశం గర్వించదగ్గ ప్రజానాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాలరాజు అన్నారు. శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యాలయం వద్ద భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి దివంగతులు అయినందుకు నాయకులు, కార్యకర్తలు అటల్ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు రోడ్లు జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, అదే విధంగా పోఖ్రాన్ అణుపరీక్షలు, నదుల అనుసంధానానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. సమాజంలో కడు బీదవారికి సంక్షేమ పధకాలు అందే ప్రయత్నం చేయడం, సమాచారం కోసం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు టెలీఫోన్, సెల్‌ఫోన్లు సౌకర్యం కల్పించారని తెలిపారు.ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా వంటివారు వారి అడుగుజాడలలో నడుస్తూ ప్రజాజీవితంలో పనిచేస్తున్నారని చెప్పారు.

వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటు

బొబ్బిలి, ఆగస్టు 17: మూడు సార్లు ప్రధానమంత్రిగా జాతికి సేవలందించిన మహానేత మాజీప్రధాని అటల్‌బీహార్ వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి, మాజీ ఛైర్మన్ ఆర్‌వి ఎస్‌కెకెరంగారావు(బేబీనాయన)లు అన్నారు. మాజీ ప్రధాని అటల్‌బీహార్ వాజ్‌పేయి మృతికి సంతాపం తెలియజేస్తు స్థానిక రాజ్‌దర్భార్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దక్షిణ దేవుడి వద్ద బిజెపీ నాయకులు పుల్లెల శ్రీనివాసరావు, వంగపండు శ్రీరామూర్తినాయుడులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సంతాప సభలలో వారు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతో కృషి చేశారన్నారు. పరిపాలన దక్షుడు, రాజనీతిజ్ఞుడుగా పేరుపొందిన వాజ్‌పేయి మృతి చెందడం దేశానికి తీరని లోటన్నారు. ఆయన ప్రధానమంత్రిగా అనేక రకాల సంక్షేమపథకాలకు తెరతీశారన్నారు. ఆయన హయంలోనే దేశం అన్నిరంగాల్లోను ముందంజలోకి వెళ్లిందన్నారు. అటువంటి నాయకులను స్ఫూర్తిగా చేసుకుని దేశాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయవల్సిన అవసరం ఉందన్నారు. పలుదేశాలతో శాంతి ఒప్పందాలు చేసుకుని భారతదేశ పేరుప్రఖ్యాతలను ఇనుమడింపచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు, పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్‌తోపాటు వార్డు కౌన్సిల్ సభ్యులు రామ్మూర్తినాయుడు, తిరుపతిరావు, హైమావతి, తదితరులు పాల్గొన్నారు. అలాగే పురపాలక సంఘం కార్యాలయం వద్ద అటల్‌బీహార్ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గణపతిరావు, కమిషనర్ శంకరరావుతోపాటు పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు.