విజయనగరం

అన్ సర్వే భూములకు మోక్షమెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 17: జిల్లాలో మూడు మండలాల్లోని 44 గ్రామాలకు సర్వేకాకపోవడంతో నేటికి ఆయా గ్రామాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాల్లో మూడు గ్రామాలు మినహా మిగిలిన వాటిలో నేటి వరకు సర్వే జరగలేదు. దీంతో ఆ గ్రామాల్లో రెవెన్యూ సరిహద్దులు, అటవీశాఖ సరిహద్దులపై సర్వే కాకపోవడంతో ఆ గ్రామంలో భూములన్నీ 22(ఎ)లో నమోదు చేశారు. దీంతో అక్కడ రైతులు తమ జిరాయితీ భూములపై రుణాలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య నెలకొంది. దీనిపై గత ఏడాది వరకు సర్వే చేపట్టేందుకు నిధులు లేమితో చేతులెత్తేశారు. మరికొనే్నళ్లు సర్వేయర్లు కొరత కారణంగా తాము సర్వే చేసేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. కాగా, ఇటీవల జిల్లాలో కొత్తగా 16 మంది సర్వేయర్లు రావడంతో సర్వేయర్ల కొరత తీరింది. జిల్లాలో వివాదాస్పద గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడంతోపాటు, సర్వేయర్లను కూడా కేటాయించారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్ దీనిపై దృష్టి సారించి వెంటనే మూడు మండలాల్లో అటవీశాఖ, సర్వేశాఖ కలిపి ఉమ్మడి సర్వే నిర్వహించి అటవీ హద్దులు, రెవెన్యూ సరిహద్ధులను ఆయా గ్రామాల్లో గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అటవీశాఖ రిజర్వు ఫారెస్టు భూములు ఏ మేరకు ఉన్నాయన్నదీ సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్ ఆధారంగా నిర్ణయించాల్సి ఉంది. ఈ విధంగా రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఎంత భూములు ఉన్నాయన్నదీ నిర్ధారించిన తరువాత రెవెన్యూ సరిహద్దులను గుర్తించనున్నారు.
ఆ తరువాత ఆయా ప్రాంతాల్లోని రెవెన్యూ సరిహద్దుల ప్రాంతంలో ఉన్న రైతుల భూములకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ వివాదం ఏళ్ల తరబడి నలుగుతున్నప్పటికీ గతంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతొ ఈ సమస్య ఏళ్ల తరబడి నలుగుతొంది. ఏది ఏమైనప్పటికీ సర్వేగాకుండా మిగిలిపోయిన గ్రామాలకు సర్వే నిర్వహించడం వల్ల అటు రెవెన్యూ అధికారులకు, ఇటు రైతులకు ఎంతో మేలు చేకూరనుంది.