విజయనగరం

‘గిరిజన రోగులకు సక్రమంగా వైద్యసాయం అందించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, ఆగస్టు 17: గిరిజన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ విశాఖలోని కెజిహెచ్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పార్వతీపురం ఐటిడిఎ ఆధ్వర్యంలో గిరిజన రోగులకు వైద్యసాయం అందించడానికి కెజిహెచ్‌లో ఏర్పాటు చేసిన ఐటిడిఎ ట్రైబల్ సెల్‌ను సందర్శించిన అనంతరం వివిధ వార్డుల్లో వైద్య చికిత్సలు అందుకుంటున్న గిరిజన రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీసారు. అదేవిధంగా రోగులకు సేవలందించే వైద్యాధికారులకు కూడా తగు సూచనలు చేశారు. గిరిజన రోగులకు సేవలందించడంతో వైద్యాధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.

స్వజల పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు

విజయనగరం, ఆగస్టు 17: స్వజల మంచినీటి పథకం ద్వారా గ్రామాల్లో ప్రజలకు మంచినీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య జాయింట్ సెక్రటరీ వి.రాధ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వజల ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో అవసరం మేరకు మంచినీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉందన్నారు. దేశంలో 117 వెనుకబడిన జిల్లాల్లో పది జిల్లాలను ఎంపిక చేశామని వాటిలో విజయనగరం జిల్లాను ప్రయోగాత్మక జిల్లాగా ఎంపిక చేసినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా స్వజల ప్రాజెక్టు బృందం ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు అమలు చేయడానికి ముందర ఒడిఎఫ్ పూర్తయి ఉండాలన్న నిబంధన ఉందన్నారు. ఆ పంచాయతీలు నిర్వహణ చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని వివరించారు. ప్రాజెక్టు నిర్వాహణలో విధిగా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. దీని ద్వారా కమ్యూనిటీ వాటర్ ట్రీట్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేసి నాణ్యమైన నీరును అందించేందుకు నీటి పరీక్షలు నిర్వహించి మంచినీటిని మాత్రమే సరఫరా చేయాలన్నారు.కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలో 236 గ్రామాల్లో ఈ పథకానికి రూ.4400.50 లక్షలతో అమలు చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. అనంతరం జెడ్పీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన ఫొటొ ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి, చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, కృష్ణారెడ్డి, జెసి-2 సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

నగరదర్శినిపై పెదవి విరుపు
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 17: పట్టణంలో నాలుగవ వార్డు పరిధిలో పూల్‌భాగ్‌కాలనీలో శుక్రవారం నిర్వహించిన నగరదర్శిని కార్యక్రమంపై కాలనీవాసులు పెదవి విరిచారు. పట్టణంలో ఈనెల 10వతేదీన నగరదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి మొక్కుబడిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడంలేదు. నగరదర్శిని కార్యక్రమం గురించి ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కనీసం పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వార్డుసభలో మున్సిపల్‌కమిషనర్ టి.వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కిల్లాన పార్వతి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్ కె.హరిదాసు, మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శివకుమార్, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీదేవి, సూపర్‌వైజర్ మణికేసరి, మెప్మా కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు దన్నాన గోవిందరావు, గేదేల రాము, మెప్మా టిఎంసి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.