విజయనగరం

రైతులు పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, ఆగస్టు20: జిల్లాలో రైతులు పండించే పంటల పట్ల ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని జిల్లా ఆత్మా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ మోహనరావు అన్నారు. సోమవారం ఎల్.కోట వెలుగు కేంద్రంలో జరిగిన రైతులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు ఎక్కువ శాతం ఎల్.కోటలో యదలు వేశారని, మామ్మోలు ఉడుపుకూడా ఉడిశారని ఈ రెండింటిలో కలుగుతున్న మార్పులను పరిశీలించేందుకు వచ్చామని, అదేవిధంగా ఎల్.కోట రైతులకు చీడపీడలపై ఏ విధంగా స్పందించాలో తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కత్తెర పురుగు మొక్కజొన్నను ఎక్కువగా నాశనం చేస్తున్నదని, వంద రకాల పంటలను ప్రభావితం చేసే పురుగు అని దీనిలో వరి కూడా వస్తుందని ఆయన అన్నారు. వీటిని నివారించేందుకు కృత్రిమ ఎరువులు కాకుండా సేంద్రీయ ఎరువులు వాడకం ద్వారా జీవామృతం, ఇతర సేంద్రీయ రసాల పిచికారీ వలన వీటిని సులభంగా నివారించవచ్చునని కొంతమంది రైతులు వివరించారు. ఆధునిక పద్దతుల్లో సక్రమమైన మోతాదులో భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు వేసుకుంటూ రైతులు ముందుకు వెళ్ళాలని, దీనివలన చీడపీడల ప్రభావం తగ్గుతుందని రైతులు లాభపడతారని అన్నారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖతో సంప్రదిస్తూ పంటలో వస్తున్న మార్పులను అధికారులకు తెలియజేస్తే అది ఏవిధమైన మార్పు తీసుకోవాల్సిన చర్యలు అధికారులు తెలియజేస్తారని, వ్యవసాయ శాఖ రైతులకోసం నిరంతరం కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. రైతులు ప్రతి పంట పొలాలకు ఇన్సూరెన్సు తప్పనిసరిగా చేయించుకోవాలని,వరికి సంబంధించి ఈ నెల 21తో తేదీ ముగుస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ శాస్తవ్రేత్త సంధ్య, ఏవొ శ్రీనివాసరావు, వ్యవశాఖ ఎడి మహరాజన్, మార్కెట్ కమిటీ మెంబరు దేవిలు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే చంద్రబాబు థ్యేయం
గంట్యాడ, ఆగస్టు 20: ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు థ్యేయమని టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు అన్నారు. కొండతామరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగులు వెలగాడ మురళికి శస్త్ర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు కోసం గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు ముఖ్య మంత్రి స్పందించి 1.25లక్షలను సిఎం రివ్యూ ఫండ్ కింద మంజూరు చేశారు. ముందుగా మంజూరు ఉత్తర్వులు సోమవారం గంట్యాడలో దివ్యాంగుడు మురళికి కొండపల్లి భాస్కరరావు తదితరుల చేతులుమీదుగా అందజేశారు. ముఖ్యమంత్రిచేసిన సహాయం పట్ల మురళి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గంట్యా పిఎసిఎస్ అధ్యక్షుడు బూడు గాంధీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.