విజయనగరం

వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఆగస్టు 20: గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని ఎంపిడివొ ఎం.ప్రకాశరావు అన్నారు. సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలు సాధనకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా గ్రామాలన్నీ అభివృద్ధి పధంలో నడపడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్టీ ఆర్ గృహాలు, చెత్తనుండి సంపద కేంద్రాలు, పూర్తిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర, ఇవొ పి ఆర్ డి రవికుమార్, మండల విద్యాశాఖాధికారి కూనిబిల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీలో యథావిధిగా పారిశుద్ధ్యం పనులు
* సమ్మె ప్రభావం అంతంతమాత్రం
* ఎఐటియుసి అనుబంధ కార్మికులు విధులకు హాజరు
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 20: పట్టణంలో ఔట్‌సోర్సింగ్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ పారిశుద్ధ్యపనులు యధావిధిగా జరుగుతున్నాయి. కృష్ణా కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ప్రైవేటు పారిశుద్ధ్య కార్మికులను పనుల్లోకి తీసుకుని పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నారు. మున్సిపాలిటీలో అమలు చేస్తున్న జీవోనెంబర్ 279కు వ్యతిరేకంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘానికి చెందిన 225 మంది పారిశుద్ధ్య కార్మికులు గత కొన్నిరోజుల నుంచి విధులను బహిష్కరించారు. అయితే ఎఐటియు అనుబంధ కార్మిక సంఘానికి చెందిన 50 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారు. తమ యూనియన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారని ఇప్పటికే ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రంగరాజు ప్రకటించారు. అయితే జీవోనెంబర్ 279ని రద్దుచేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ డిమాండ్ చేశారు. ఒకవైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో క్షీణిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు కృష్ణా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధులు నడుం బిగించారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేసిన నేపధ్యంలో కృష్ణా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధి గుడవర్తి వెంకట పతంజలి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రైవేటు పారిశుద్ధ్య కార్మికులను పనుల్లోకి తీసుకుని పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే కృష్ణా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

ప్రత్యేక అధికారుల పాలనలో నిబంధనలు పాటించాలి
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 20: గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించాలని లోకల్ గవర్మమెంట్స్‌ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు జిల్లాలో కొంతమంది ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీల్లో రాజకీయ దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. గతంలో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీల్లో నిధుల వినియోగంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. పంచాయతీల పాలకవర్గం పదవీకాలంలో గ్రామసభల్లో ఆమోదించిన ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి ప్రత్యేక అధికారులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీల పదవీకాలంలో మిగిలిపోయిన అభివృద్ధిపనులను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ప్రత్యేక అధికారులు గ్రామసభల్లో ఆమోదించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు, అవినీతికి పాల్పడే ప్రత్యేక అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ సభ్యుడు సన్యాసినాయుడు, రాంబాబు, రామేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.