విజయనగరం

అల్పపీడనంపై అప్రమత్తంగా వ్యహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఆగస్టు 20: అల్పపీడనంపై అధికారులు అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని తహశీల్ధార్ బి.శేషగిరిరావు అన్నారు. సోమవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో జరిగిన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండురోజులలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించినందున ఏ ప్రాంతమైనా ముంపుకు గురఅయ్యే అవకాశం ఉందని చెప్పారు. అటువంటివి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదే విధంగా వర్షాలు కురుస్తున్నందున వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని, తక్షణమే గ్రామాలలో ప్రతేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపిడివొ ఎస్.కృష్ణవేణమ్మ మాట్లాడుతూ గ్రామ ప్రత్యేక అధికారులు తమకు అప్పగించిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఎన్టీ ఆర్ గృహలు త్వరితగతిన జరిగేలా చూడాలని తెలిపారు. చెత్తనుండి సంపద కేంద్రాల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. అనిశాఖల అధికారులు తమ లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

డిసిసిబిల పదవీకాలం పొడిగింపుపై పక్షపాతం
* మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య
గజపతినగరం, ఆగస్టు 20: జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పదవీకాలం పొడిగింపులో ప్రభుత్వం పాతధోరణి అవలంబించిందని స్ధానిక మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకులు బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పదకొండు జిల్లాలలో డిసిసిబి పదవీకాలం పొడిగించి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తప్పించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వైకాపా నేతలు అధ్యక్షులుగా ఉన్నారనే ఉద్దేశ్యంతో తప్పుడు కారణాలు చూపి తప్పించుకోవడం విడ్డూరమని ప్రజలు దీనికి తగిన శాస్తి చేయక తప్పదని అన్నారు. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు, అతిసారంలాంటి వ్యాధులు ప్రబలి ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతుంటే జిల్లా మంత్రి, అధికార ఎమ్మెల్యేలు చోద్యం చూడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కనీసం జిల్లాస్ధాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి రోగుల పరిస్ధితిని గమనించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కబుర్లతో కాలక్షేపం చేయడం దారుణమని చెప్పారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, వైకాపా నాయకులు దొగ్గ దేవుడునాయుడు, పల్లి సంజీవరావు, ఉత్తరావిల్లి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు తెరవడానికి చర్యలు
గజపతినగరం, ఆగస్టు 20: రుణాలు అందుకునే లబ్దిదారులు బ్యాంకు ఖాతాలు ఈనెల 28లోగా తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడివొ ఎస్.కృష్ణవేణమ్మ ఆదేశించారు. సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితరులు బ్యాంకు ఖాతాలు తెరిచేలా చూడాలని అన్నారు. అదే విధంగా ఆదరణ పధకం ద్వారా అందించనున్న పనిముట్లు ఏమి కావాలో తక్షణమే మీసేవా ద్వారా చేయాలని కోరారు. మండలానికి వచ్చిన ఎల్ ఇడి బల్బులు విక్రయాలు పూర్తిచేయాలని చెప్పారు. చెత్తనుంచి సంపద కేంద్రాలు పూర్తికి చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో ఇవొ పి ఆర్‌డి జి.జనార్ధనరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.