విజయనగరం

ప్రధాని జన్మదినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 17: భారత ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు అధ్యక్షతన పట్టణంలో సోమవారం ‘స్వచ్చతాహి సేవాహై’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పధకాల గురించి చర్చించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, సాలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంటా అప్పలనాయుడు, నెల్లిమర్ల ఇన్‌ఛార్జి కృష్ణారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.శివప్రసాద్‌రెడ్డి, పి.అశోక్, రేణుసింగ్, భాషా, రామ్‌జీ తదితరులు పాల్గొన్నారు.

వదలని జ్వరాలు..తప్పని అవస్థలు
* విటి అగ్రహారం ఎస్సీకాలనీలో డెంగ్యూ కేసు

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 16: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు, వ్యర్థాలు, పూడికల తొలగింపు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నా పట్టణ ప్రజానీకాన్ని జ్వరాలు వదలడంలేదు. గత కొన్నినెలల రోజుల నుంచి డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ జ్వరాలు పట్టిపీడిస్తుండగా ఇప్పుడు చికెన్‌గున్యా జ్వరాలు విజృంభించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన చెత్తాచెతారం, వ్యర్థాలు, పూడికలను మున్సిపల్ యంత్రాంగం తొలగిస్తున్నప్పటికీ, జ్వరాల తీవ్రత మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా పందులు, కుక్కల సంచారం పెరగడం, దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో పట్టణంలో ప్రతి ఇంటిలో జర్వపీడికలు కనిపిస్తున్నారు. ఒకవైపుమున్సిపల్ యంత్రాంగం, మరోవైపువైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు ప్రత్యేకబృందాలుగా ఏర్పడిన దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. దీనికితోడు ప్రతీరోజూ మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, సాయంత్రం నాలుగు గంటల తర్వాత వర్షం కురుస్తుండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. జెసి వెంకరమణారెడ్డి, కమిషనర్ వేణుగోపాల్ ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.