విజయనగరం

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల,సెప్టెంబర్ 17: సిపిఎస్ రద్దు చేయాలని ఎపిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బుకారీబాబు డిమాండ్ చేశారు. సోమవారం మొయిద ఉన్నత పాఠశాల వద్ద ప్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి ఎస్ విధానాన్ని రద్దుచేసి, ఓపిఎస్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈనెల 19న చాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మజ్జి శ్రీనివాసరావు, కె. అప్పారావు, పి.తవిటయ్య, పి.శ్రీనివాసరావు, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి

శృంగవరపుకోట, సెప్టెంబర్ 17: ఈనెల 21,22 తేదీలలో జగన్ నిర్వహించబోయే ప్రజా సంకల్ప యాత్రను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మాజీ గంథ్రాలయ చైర్మన్, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందుకూరి రఘురాజు తెలిపారు. పట్టణంలోని సుబ్బిరామిరెడ్డి కల్యాణ మండపంలో విలేఖరుల సమావేశంలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు చేరువై తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతిని తెలిపి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న రోజుల్లో ఆ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన కోరారు. గ్రామాల నుండి ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఈ సంకల్ప యాత్రకు ప్రజలను తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమయ్యే వరకు
పోరాటం ఆగదు

లక్కవరపుకోట, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని ఎల్.కోట మండల వీఆర్వోలు అన్నారు. రాష్ట్ర రెవెన్యూ సంఘం కార్యవర్గ తీర్మానం ప్రకారం ఈనెల 15 నుండి 25వ తేదీ వరకు ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించారని, దీని ప్రకారం 15,18తేదీల్లో సామూహిక సెలవులు పెట్టి జిల్లా కేంద్రంలో రిలే నిరాహారదీక్షలో పాల్గొంటామని అన్నారు. 19,20 తేదీలలో పెన్‌డౌన్ కార్యక్రమం, 22న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్ష, 25న చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటామని దీని కారణంగా సెలువులు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక ఉప తహశీల్దార్‌కు సోమవారం మెమోరాండం అందజేశారు. ప్రమోషన్లు, వేతనాల పెంపు తదితర డిమాండ్లు అన్నీ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని లేని యడల పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వి ఆర్వోలు పాల్గొన్నారు.

కనీస సదుపాయాలు ప్రజలకు కల్పించాలి
* ఎంపిడివొ కృష్ణవేణమ్మ

గజపతినగరం,సెప్టెంబర్ 17: కనీస సదుపాయాలు ప్రజలకు కల్పించాలని స్ధానిక ఎంపిడివొ ఎస్.కృష్ణవేణమ్మ అన్నారు. సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులకు పంచాయతీ పాలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచినీటి సదుపాయంతోపాటు విద్యుత్, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేకశ్రద్ధ కనబరచాలని తెలిపారు. స్వచ్చ పంచాయతీలుగా తీర్చిద్దిడానికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యమ్రాలు చేపట్టి ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలన్నారు. ప్రతి శనివారం తమ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రతకోసం చర్యలు తీసుకోవడంతోపాటు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్చతా కార్యమ్రాలు ఈనెల 15వతేది నుండి 29వరకు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్ధార్ బి.శేషగిరిరావు, మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచస్ధాయిలో దేశానికి
గుర్తింపు మోదీ పరిపాలన
* బీజేపీ రాష్ట్ర నేత గోపాలరాజు

గజపతినగరం,సెప్టెంబర్ 17: ప్రపంచస్ధాయిలో భారతదేశానికి గుర్తింపు తచ్చేవిధంగా ప్రధానిమంత్రి నరేంద్రమోదీ పరిపాలన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.వి.గోపాలరాజు అన్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని గోపాలరాజు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడంతో పాటు గజపతినగరం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేసే విషయంలో అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి మోదీ చేసిన అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి పక్షాలుతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం మోదీపై చేస్తున్న దుష్పప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్లే విషయంలో మనమందరం కష్టపడాలని కోరారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె.ఎ.ఎస్.ఎస్. గుప్తా, నగర ప్రసన్నకుమారి, ఎన్. అప్పలనాయుడు, జె. కృష్ణ, కె.ఎన్.ఎం. శర్మ, ఏడుకొండలు, చందు, కృష్ణ, కె. సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుడి మృతి
దత్తిరాజేరు, సెప్టెంబర్ 17: మండలంలోని గడసాం గ్రామానికి చెందిన సింగారపు పైడితల్లి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిందని కుమారులు అప్పలరాజు, సత్యంలు తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థకు కట్టిన నగదు తిరిగి రాలేదనే మనస్తాపంతో చనిపోయిందని కుమారులు తెలిపారు. ఈమెకు నాలుగు రోజుల క్రితం గుండెపోటు రాగా మెరుగైన చికిత్స కోసం విశాఖ కెజిహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిందని తెలిపారు. అగ్రీగోల్డ్ జిల్లా కమిటీ అధ్యక్షుడు మజ్జి సూరప్పడు, ఉపాధ్యక్షుడు సి.హెచ్.వి. వెంకటరమణ, గజపతినగరం శాఖాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావుతదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

పూసాహైడ్రోజల్ ద్వారా నీటి ఎద్దడి నివారణ

గజపతినగరం,సెప్టెంబర్ 17: పూసాహైడ్రోజల్ ద్వారా నీటి ఎద్దడి నివారణకు ఎంతో మేలుకలుగుతుందని ఆత్మా బిటి ఎం ఉదయసిరి అన్నారు. సోమవారం మండలంలోని దావాలపేట గ్రామంలో గల ఆత్మా ప్రదర్శనా క్షేత్రంలో వరిలో పూసాహైడ్రోజల్ గుళికలను ఇసుకలో కలిపి చల్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా వర్షాదారంపై పండించే పొలాలలో దీనిని వాడాలని తెలిపారు. ఈ గుళికలు మట్టిలోని తేమను తీసుకొని ఉబ్బుతాయని అన్నారు. నీటి ఎద్దడి ఏర్పడినపుడు నీటిని అందిస్తుందన్నారు. ఇది వాడటం ద్వారా నెల రోజులపాటు మొక్కలకు ఎటువంటి ఇబ్బందులు రాదన్నారు. వరి, జీడి,మామిడి, కూరగాయలు తదితర పంటలకు వాడవచ్చని చెప్పారు. ఎకరాకి కిలో పూసాహైడ్రోజల్‌ను పదికిలోల ఇసుకలో కలిపి వేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎపి ఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

పల్లెలను అభివృద్ది పధంలో నడిపించాలి
* ఎంపిడివొ ఎం.ప్రకాశరావు

బొండపల్లి,సెప్టెంబర్ 17: గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపించడానికి అధికారులు కృషి చేయాలని స్ధానిక ఎంపిడివొ ఎం.ప్రకాశరావు కోరారు. సోమవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచులు పాలన లేనందున అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు చేపట్టాలసిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించాలన్నారు. అదేవిధంగా ప్రజలకు వౌళిక సదుపాయాలు కల్పించాల్శిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్ శేఖర్, మండల పంచాయతీ విస్తరణ అధికారి రవికుమార్, మండల విద్యాశాఖాధికారి కూనిబిల్లి సింహాచలం, మండల వ్యవసాయశాఖాధికారి కె.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సిపిఎస్ రద్దు కోరుతూ నల్లబ్యాడ్జీలతో నిరసన

బొండపల్లి,సెప్టెంబర్ 17: ఉద్యోగ, ఉపాధ్యాయులకు గదిబండగా మారిన సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీల ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల నాయకులు చింతా ఈశ్వరరావు మాట్లాడుతూ సిపి ఎస్‌ను రద్దు చేసేంతవరకు ఉపాధ్యాయులు అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిపి ఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా తదితర నినాదాలతో హోరెత్తించారు. బొండపల్లి, దేవుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

వెయిట్‌లిఫ్టింగ్ సమావేశం విజయవంతం చేయాలి

గజపతినగరం, సెప్టెంబర్ 17: గజపతినగరంలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లో బుధవారం నిర్వహించనున్న జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి. అప్పారావు, డాక్టర్ బి. ఎస్. ఆర్.మూర్తిలు కోరారు. సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో గల వెయిట్ లిఫ్టింగ్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సభ్యురాలు బి.అశ్వని, ఎ. ఎల్.నాయుడు ఆదుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.