విజయనగరం

జిమ్ అభివృద్ధికి మరింత కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, సెప్టెంబర్ 24: కొండవెలగాడ వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామశాలకు మరింత కృషి చేస్తానని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సోమవారం ఆయన కొండవెలగాడలోని వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామశాలను సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ కొండవెలగాడ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరును ఇనుమడింప చేశారని చెప్పారు. వ్యాయామశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు అవసరమని అన్నారు. క్రీడల వల్ల శారీర ధారుఢ్యంతోపాటు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు అని చెప్పారు. అలాగే క్రీడల్లో రాణించే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అట్టాడ లక్ష్మునాయుడు, పిడి రామారావు,కోచ్ చల్లా రాము, నాయకులు కర్రోతు రాజినాయుడు, సీతానాయుడు, డాక్టర్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
సులభమైన రీతిలో బోధించాలి
నెల్లిమర్ల, సెప్టెంబర్ 24: విద్యార్థులకు ఉపాద్యాయులు సులభమైన రీతిలో బోధనలు జరపాలని ఎం ఇవొ అంబళ్ళ కృష్ణారావు అన్నారు. మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులకు ఎమ్మార్సీలో సోమవారం నిర్వహించిన హరల్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుని కేటగిరిల వారీగా విభజించి బోధించాలని అన్నారు. ఒకటవ తరగతి వారికి చదవడం, రాయడం నేర్పించాలని సూచించారు. తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో పట్టు సాధించేలా పునాది వేయాలని అన్నారు. మూడు రోజులుపాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌లు, సిఆర్పీలు పాల్గొన్నారు.

విలువలతో కూడిన విద్య అవసరం
* ఎంపీపీ సువ్వాడ వనజాక్షి
నెల్లిమర్ల, సెప్టెంబర్ 24: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరమని ఎంపీపీ సువ్వాడ వనజాక్షి అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలోని ఎయిమ్స్, డైట్ కళాశాల ఫేర్‌వెల్ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఎంపీపీ సువ్వాడ వనజాక్షి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించినపుడే వారు సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. ఉపాద్యాయ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు స్వలాభం కోసం చూసుకోకుండా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మొగ్గు చూపాలని అన్నారు. ఎయిమ్స్ విద్యా సంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి తన వంతుగా ఎంతోకొంత చేయూతను అందించాలనే ఉద్దేశ్యంతో విద్యా సంస్థలను నడుపుతున్నానని చెప్పారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్‌లో ఉత్తమ ఉపాద్యాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులను సాదరంగా ఆహ్వానం పొందారు. అలాగే ప్రిన్సిపాల్ భారతి, అద్యాపకురాలు పుష్పలత తదితరులను సీనియర్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ పాఠశాలల ప్రతినిధులు, టీడీపీ జిల్లా ఉపాద్యక్షులు సువ్వాడ రవిశేఖర్ నాయకులు అవనాపు సత్యన్నారాయణ, కర్రోతురాజినాయుడు, రెడ్డి వేణు, గురాన అసిరినాయుడు, చింతపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రస్తుత సమాజంలో వరకట్నం విస్తృత రూపాన్ని విద్యార్థులు నాటిక రూపంలో ప్రదర్శించారు.

వీధి దీపాల విద్యుత్ కనెక్షన్లు కట్
గజపతినగరం, సెప్టెంబర్ 24: గజపతినగరం మండలంలో పంచాయతీల నుండి బకాయిలు పేరుకుపోయినందున సోమవారం నుంచి విద్యుత్ దీపాల కనెక్షన్లు తొలగిస్తున్నామని గజపతినగరం విద్యుత్ శాఖ డిఇ రఘు, ఏఇ పిచ్చయ్యలు తెలిపారు. సోమవారం ఈవిషయమై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవొ కృష్ణవేణమ్మతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2017 మార్చి వరకు 77,87,019రూపాయలు కాగా 2017 ఏప్రిల్ నుంచి 2018 ఆగస్టు వరకు 28,30,000 రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని మిగిలిన మండలాల్లో ఎంతో కొంత బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ గజపతినగరం మండలంలో మాత్రం బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహించినందున విద్యుత్ దీపాల కనెక్షన్లు కట్ చేస్తున్నామని తెలిపారు.