విజయనగరం

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మే 8: గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్ష చేస్తే జైలు శిక్ష అనుభవించకతప్పదని గజపతినగరం జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక వెలుగు కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తే మూడేళ్లు జైలు శిక్షణ, పదివేల రూపాయల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. గృహ హింస, నిర్భయ చట్టాలను మహిళల రక్షణకోసం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మహిళలు తమ రక్షణతోపాటు సలహాలు,సూచనలు సహాయం పొందేందుకు కోర్టులలో న్యాయసేవా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలలో ఉచితంగా సేవలు పొందవచ్చని అన్నారు. చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నపుడే సమస్యల నుండి బయటపడవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ రమణమ్మ, ట్రైనీ ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు, న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరావు, శ్రావణ్‌కుమార్, శీరవాసు, ఎపి ఎం ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.