క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, అక్టోబర్ 3: విధి నిర్వహణ నిమిత్తం రిగ్‌పై కూర్చుని వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన యువకుని ఉదంతం ఇది. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం మండల కేంద్రానికి చెందిన బి.కిరణ్(19) నవీన్‌రెడ్డి బోర్‌వెల్స్‌లో వర్కర్‌గా చేరాడు. విధి నిర్వహణలో భాగంగా నందాం గ్రామంలో బోర్‌వెల్ తీయడానికి రిగ్‌పై కూర్చుని వెళుతుండగా మెయిన్‌లైన్ విద్యుత్ తీగలను గమనించకపోవడంతో వాటిని తాకి షాక్‌కు గురై మృతి చెందాడు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.