క్రైమ్/లీగల్

స్కూటీని ఢీకొన్న ప్రైవేటు అంబులెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరాడ, అక్టోబర్ 7: మండలంలోని జాతీయ రహదారిలో కోటిపాం- గుమడ మధ్యలో గల రాళ్లగెడ్డ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయలైన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని కోటిపాం- గుమడ గ్రామాల మధ్యలో గల రాళ్లగెడ్డ జంక్షన్ వద్ద గంగిరేగువలస నుంచి స్కూటీపై వస్తున్న వై సాయికృష్ణను ఎదురుగా వస్తున్న ప్రైవేటు అంబులెన్స్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అటుగా వెళుతున్న పలువురు ప్రయాణీకులు చూసి చికిత్స నిమిత్తం పార్వతీపురం తరలించగా పరిస్థితి విషమించడంతో విశాఖలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. సాయికృష్ణ కొమరాడ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిప్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహించేందుకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

జట్టు ఆశ్రమంలో గాయిత్రీ మాత గుడి కూల్చివేత
పార్వతీపురం (రూరల్), అక్టోబరు 7: స్థానిక జట్టు ఆశ్రమంలో నిర్మాణంలో ఉన్న గాయిత్రీమాత పీఠాన్ని ఆదివారం పార్వతీపురం పట్టణానికి చెందిన కొందరు జెసిబితో కూల్చివేసారని జట్టు నిర్వాహకురాలు పద్మజ తెలిపారు. ఆమార్గం గుండా ఆయా వ్యక్తుల రియల్ ఎస్టేట్‌లకు మార్గం వేసుకునేందుకుగాను ఈ చర్యలకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. అడ్డుకున్న తమ ఆశ్రమ పిల్లలపై దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసారన్నారు. విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఆశ్రమంలో ఎవరూ లేనపుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం అన్యాయమన్నారు.