విజయనగరం

చేయి చేయి కలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 9: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేందుకు పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాలు ఒక వేదికపైకి వచ్చాయి. సేవ్ డెమాక్రసీ కొవ్వొత్తుల ప్రదర్శన నిరసనలో చేతులు కలిపిన కోలగట్ల, మాజీమంత్రి బొత్స వర్గాలు తాజాగా ప్రత్యేక హోదా సాధన ఉద్యమ పోరాటంలో ఇరు వర్గాలనేతలు ఒక తాటిపైకి వచ్చారు.సోమవారం కలెక్టరేట్ కూడలికి చేరుకుని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెన్మత్ససాంబశివరాజు, పార్టీజిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స వర్గానికి చెందిన ముఖ్యనేతలు మజ్జి శ్రీనివాసరావు, యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయకుమార్‌తో కలిసి ధర్నా ఏర్పాట్లను పరిశీలించారు. మంగళావారం తలపెట్టిన ప్రత్యేకహోదా ధర్నాకు జిల్లా నలుమూలలనుండి వివిధ వర్గాల ప్రజలు ఇక్కడికి తరలిరానున్నందున వేసవి నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది రాకుండా ధర్నాను విజయవంతం చేసేందుకు తీసుకోవలిసి చర్యలపై చర్చించారు. తొమ్మిది నియోజకవర్గాలనుండి తరలివచ్చే జనంకోసం అవసరమైన షామియానాలు, ఇతర ఏర్పాట్లపై పార్టీ ముఖ్యనేతలు ఇచ్ని సూచనలను పరిగణలోకి తీసుకుని పక్కాగా ఏర్పాట్లు చేయించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీకార్యకర్తలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు సురేష్‌బాబు, కెవి సూర్యనారాయణరాజు, అంబళ్లశ్రీరాముల నాయుడు, పీరుబండిజైంహింద్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, కార్యకర్తలు పాల్గొన్నారు.