విజయనగరం

చెడ్డపేరు తెస్తే ఉద్వాసనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, మే 10: గ్రామాలలో ప్రభుత్వ పథకాలు విజయవంతం చేయడానికి సహకరించాల్సిన జన్మభూమి కమిటీల్లో చెడ్డపేరుతెచ్చే సభ్యులను తొలగిస్తామని గృహనిర్మాణ మంత్రి మృణాళిని హెచ్చరించారు. మంగళవారం గరివిడి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మ భూమి కమిటీలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు చెడ్డపేరు తెస్తున్నాయని జడ్పీ వైస్‌చైర్మన్ బలగం కృష్ణమూర్తి తెలిపారు. దీనిపై మంత్రి మృణాళిని స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద కూడా ఈ సమస్య చర్చకు వచ్చిందన్నారు. అవసరం అనుకుంటే అలాంటి సభ్యులను తప్పిస్తామని సిఎం సూచించారని చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులు సామాన్యులకు కూడా ప్రభుత్వ సేవలను అందించి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపిటిసి సభ్యులు గ్రామాలలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు అదనంగా మంజూరుచేయాలని కోరారు. ఎన్టీ ఆర్ గృహ వసతి రుణాలకోసం విధించిన నిబంధనలలో అవసరంమేరకు సడలించాలని కోరారు. జడ్పీ వైస్‌చైర్మన్ బలగం కృష్ణ, ఎంపిపి సింహాచలం, మాజీ ఎంపిపి పైల బలరాం తదితరులు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను లక్ష్యాల మేరకు పూర్తిచేసుకోగలిగామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఇసి ఎస్ వైస్ చైర్మన్ సురేష్, ఎంపిడిఓ కామేశ్వరరావు పాల్గొన్నారు.