క్రైమ్/లీగల్

మనస్తాపంతో అగ్రిగోల్డ్ బాధితురాలు మృతి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), నవంబర్ 11: మనస్తాపంతో అగ్రిగోల్డ్ బాధితురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని చినబొండపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పిన్నింటి అప్పమ్మ (40) అగ్రిగోల్డ్‌లో కొంత సొమ్మును పొదుపు చేసింది. అగ్రిగోల్డ్ సంస్థను ఎత్తివేసినప్పటి నుండి మనస్తాపంతో బాధపడుతోంది. దీనిలో భాగంగా ఆదివారం కూడా అగ్రిగోల్డ్ డబ్బులు గూర్చి కొంతసేపు చర్చించి, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త సూర్యనారాయణ, కుమార్తె శ్రావణి, కుమారుడు నవీన్ లున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బులు ఇక రావని బయంతో తన భార్య మృతి చెందినట్లు భర్త సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.

వివాహిత ఆత్మహత్యాయత్నం
జియ్యమ్మవలస, నవంబర్ 11: మండల కేంద్రం సమీపంలో బస్సులో శనివారం రాత్రి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, చినమేరంగి ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం లీలా అనే వివాహిత గర్భాం గ్రామం నుంచి జయ్యమ్మవలస గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సులో బయలుదేరింది. అయితే బస్సు మండల కేంద్రం సమీపానికి రాగానే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే లీలాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు అక్కడ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం సిహెచ్‌సీకి తరలించారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.