విజయనగరం

దివ్యాంగులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిజిపేట, నవంబర్ 15: దివ్యాంగులను ప్రతీ ఒక్కరూ ఆదుకోవాలని అభిమాని ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెడ్డి రాజగోపాలనాయుడు అన్నారు. ఈమేరకు గంగాడ గ్రామంలో అభిమాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల సహకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలస్థాయి దివ్యాంగుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను అన్నివిధాలా ఆదుకుంటామని, 2016 భారతదేశ ప్రభుత్వం దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలులో జాప్యం జరుగుతుందన్నారు. హక్కుల సాధనకు దివ్యాంగులంతా ముందుకు రావాలన్నారు.
అనంతరం జిల్లా అభిమాని విభిన్నప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు డొంకాడ రవి మాట్లాడుతూ దివ్యాంగులకు ఇప్పటి వరకు 32 ట్రైసైకిళ్లు, 55వేల రూపాయల రుణాలు ఇచ్చామని, అభిమాని సంస్థలో 1200మంది సభ్యులుగా చేర్చామన్నారు. ఈ కార్యక్రమంలో గంగాడ గ్రామస్థులు రాధాకృష్ణ, లక్ష్మునాయుడు, జగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి
*మంత్రి సుజయ్

బాడంగి, నవంబర్ 15: గ్రామాలకు అవసరమైన వౌళిక సదుపాయాలు టీడీపీ హయాంలోనే సంపూర్ణంగా అందుతున్నాయని మంత్రి సుజయ్‌కృష్ణరంగరావు అన్నారు. గురువారం మండలం రేజేరు గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శినిలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు అన్ని గ్రామాల్లో 100శాతం సీసీరోడ్లు నిర్మాణం, శ్మశాన వాటికలు, సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ షెడ్లును ఏర్పాటు చేశామన్నారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ భవనాలకు అవసరమైన భవనాలు కల్పించడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. గ్రామంలో ఇంకా చేయాల్సిన పనులను గుర్తించేందుకు ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. తోటపల్లి కాలువ ద్వారా రేజేరు గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. బడుగు, బలహీనవర్గాలను ఆదుకోవడంతోపాటు మహిళలు, యువతను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. చంద్రన్నబీమా ఎంతోమందికి ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి లక్ష్మి, జగన్నాథరావు, ఎంపీడీఓ రవికుమార్, ఏఓ గోకుల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలి
మక్కువ, నవంబర్ 15: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని మండల ప్రత్యేక అధికారి గణపతిరావు అన్నారు. ఈమేరకు కొయ్యానపేట గ్రామంలో గురువారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన పక్కా గృహాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, తదితరివి లేనివి అడిగితెలుసుకున్నారు. అర్హులైన వారికి అందకపోతే వెంటనే దరఖాస్తులు చేసుకుంటే మంజూరుకు కృషి చేస్తామన్నారు. గ్రామాన్ని ప్రతీ ఒక్కరూ పరిశుభ్రం ఉంచుకోవడంతోపాటు కాలువల్లోను, వీదుల్లో చెత్తాచెదారాలను వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తాచెదారాలను బుట్టలలో నిల్వచేసి సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ షెడ్లుకు తరలిస్తే వాటి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారుచేయవచ్చునన్నారు. ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని, దీని వలన కాలుష్యరహిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలున్న తక్షణమే తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రామారావు, ఎంపీడీఓ శివరామప్ప, ఇఓపీఆర్‌డీ సూర్యనారాయణ, ఏపీఓ శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.