విజయనగరం

గొర్రెలకాపర్లపై పిడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, మే 12: పిడుగుపాటు రెండు పేద కుటుంబాల్లో విషాదం నింపింది. సాలూరు మండలంలోని జీగిరాం ప్రాంతంలో గొర్రెలమంద కాస్తున్న ఇద్దరు కాపర్లపై పిడుగుపడటంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతోపాటు పెద్ద పిడుగులు పడ్డాయి. జీగిరాం కాలనీ మెట్ట సమీపాన పొలంలో పట్టణానికి చెందిన అల్లు చినసామయ్య (65), జీగిరాం గ్రామానికి చెందిన మజ్జి శివ (20) అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సాలూరు పట్టణంలో గొల్లవీధి, జీగిరాం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. చినసామయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మజ్జి శివకు తండ్రి, సోదరుడు ఉన్నారు. గత కొంతకాలంగా గొర్రెల మందలు కాస్తూ వీరు కుటుంబాలను పోషించుకుంటు వస్తున్నారు. పిడుగుపాటుకు గురై అకాల మరణం చెందడంతో ఈ రెండు కుటుంబాలకు చెందిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సామయ్య మృతిచెందడాన్ని
ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. . చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందడంపై శివ కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా విలపించారు. గురువారం ఉదయం ఈ రెండు మృతదేహాలను సిహెచ్‌ఎన్‌సిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై రూరల్ ఎస్‌ఐ షణ్ముఖరావు కేసు నమోదుచేశారు.
5 లక్షల పరిహారం ఇవ్వాలి
జీగిరాం ప్రాంతంలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన ఇద్దరు గొర్రెల కాపర్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గేదెల సత్యనారాయణ, గొర్రెలకాపర్ల వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోరాడ ఈశ్వరరావులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల మందలను కాయడమే వృత్తిగా జీవిస్తున్న సామయ్య, శివల మృతితో రెండు కుటుంబాలు జీవనాధారం కోల్పోయారన్నారు. ఆ రెండు కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.