విజయనగరం

వార్డు దర్శనిలో సమస్యలు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, నవంబర్ 15: వార్డు దర్శినిలో సమస్యలు పరిష్కరిస్తామని నగర పంచాయతీ ప్రత్యేక అధికారి ఎం. లచ్చుంనాయుడు, కమిషనర్ టి.జైరామ్‌లు అన్నారు. గురువారం నగర పంచాయతీ పరిధి థామస్‌పేటలో వార్డు దర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక అధికారి లక్ష్మునాయుడు వార్డుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. థామస్‌పేట గ్రామస్తులు మాట్లాడుతూ కుళాయిలు ద్వారా మంచినీరు రెండురోజులకు ఒకసారి సరఫరా చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అలాగే పందులు స్వైర విహారంచేయడం వలన అనేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. దీనిపై ప్రత్యేక అధికారి కమిషనర్ మాట్లాడుతూ పంచాయతీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

నెల్లిమర్లను కరవు మండలంగా ప్రకటించాలి
నెల్లిమర్ల, నవంబర్ 15: నెల్లిమర్ల మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు ఈ ఏడాది వర్షాభావం వలన తెగుళ్ళు వచ్చి వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. మండలంలో 1300 హెక్టార్లలో వరినాట్లు వేయగా 800హెక్టార్లలో పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.
తుపాను బాధితులకు దుస్తులు పంపిణీ
పార్వతీపురం, నవంబర్ 15: తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం పార్వతీపురం వాణిజ్యపన్నులశాఖ (సేల్స్‌టాక్సు) అసిస్టెంట్ కమిషన్ ఎస్.జగబందుస్వామి ఆధ్వర్యంలో ఆ శాఖాధికారులు గురువారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలోని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశను కలిసి దుస్తులు అందించారు. ఇందులో భాగంగా తిత్లీ తుపాను బాధితుల కోసం 200 చీరలు, 160 దుప్పట్లు పీవో ద్వారా అందించారు. ఈ సందర్భంగా పీవో డాక్టర్ లక్ష్మీశ తిత్లీ తుపాను బాధితులకు దుస్తులు అందించిన వాణిజ్యపన్నులశాఖాధికారులకు అభినందించారు. కార్యక్రమంలో ఆశాఖ అసిస్టెంట్ కమిషనర్ (సిటివో) జగబందుస్వామితో పాటు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఎసిటివో డివి రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌కం టాక్సు, టిడిఎస్‌లపై అవగాహన
పార్వతీపురం, నవంబర్ 15: పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని వివిధశాఖల ఉద్యోగులకు ఇన్‌కం టాక్సు మరియు టిడిఎస్‌లో వచ్చిన కొత్త సవరణలపై గురువారం ఇన్‌కంటాక్సు ఆడిటర్ రాజేష్ ఐటిడిఎ గిరిమిత్ర సమావేశం హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఈఫైలింగ్ చేయడంతో పాటు టిడిఎస్ రిటర్ను దాఖలు ఏవిధంగా ఫైల్ చేయాలనే విధానంపై అవగాహన కల్పించారు. అలాగే 2018-19లో వచ్చిన లేటెస్ట్ విధానం అమలు గురించి కూడా విశదీకరించారు. కార్యక్రమంలో ఐటిడిఎ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసకుమార్, ఐటిడిఎ మేనేజర్ హేమలత, ప్రాజెక్టు వ్యవసాయాధికారి మధు, ఐటిడిఎ ఇతర ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు.