విజయనగరం

జిల్లాలో ఏడు కేంద్రాల ద్వారా రక్త సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 15: జిల్లాలో ప్రస్తుతం ఏడు కేంద్రాల ద్వారా రక్త సేకరణ జరుగుతున్నదని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వకర్త డాక్టర్ జి. ఉషశ్రీ అన్నారు. గురువారం గజపతినగరం కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ ఉషశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇంతవరకు శృంగవరపుకోట, చీపురుపల్లి, సాలూరు, బొబ్బిలి ప్రాంతాలలో రక్త సేకరణ కేంద్రాలు నిర్వహిస్తుండగా, ప్రభుత్వం ఇటీవల జిల్లాకు కొత్తగా కురుపాం, విజయనగరం ఘోసా ఆసుపత్రి, భోగాపురం, గజపతినగరంలకు మంజూరు చేయగా ఒక్క గజపతినగరం తప్పా అన్నీ ప్రారంభం అయ్యాయని తెలిపారు. గజపతినగరానికి ఇప్పటికే పరికరాలు వచ్చాయని, ఇక్కడ ఆసుపత్రివారు మరికొన్ని పరికరాలు కొనుగోలు చేసిన వెంటనే ప్రారంభానికి చర్యలు తీసుకొంటామని అన్నారు. 30 పడకల ఆసుపత్రి భవనం పక్కన గల ఖాళీ స్ధలంలో రోగుల కోసం విశ్రాంతి భవనం నిర్మాణం చేపట్టాల్శి ఉన్నప్పటికీ గుత్తేదారుడు నిర్మాణం చేపట్టలేదన్నారు. అదే విదంగా 30పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ అధికారులు జాప్యం వలన ప్రారంభం కాలేదన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఘోసా ఆసుపత్రికి ఐసియు మంజూరు కావడంతో 20 స్టాప్‌నర్స్ పోస్టులు, ఒకమత్తు వైద్యుడు, నలుగురు డ్యూటీ డాక్టర్లు పోస్టులు అదనంగా మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ.అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సహస్త్ర ఘటాభిషేకం
గజపతినగరం, నవంబర్ 15: వర్షం కోసం తాడ్డి యువసేన, దంత వైద్య నిపుణులు డాక్టర్ తాడ్డి జశ్వంత్‌నాయుడు నిర్వహించిన సహస్త్ర ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. గురువారం గజపతినగరం ఉమారామలింగేశ్వర ఆలయంలో పదిహేనుమంది వేదపండితులు ఆధ్వర్యంలో ఈ ఘటాభిషేకం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు వేదుల భువనేశ్వరప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు రాంబాబు పూజలు చేశారు. ఈ ఏడాది పంటలు పండటానికి తగినంత వర్షపాతం నమోదు కాక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికందిన పంట కళ్లముందే ఎండిపోతుంటే చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంటకోసం చేసిన రుణం పరిస్ధితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం తీవ్రంగా ఆలోచించిన డాక్టర్ జశ్వంత్‌నాయుడు వేదపండితులు సూచనల మేరకు సహస్త్ర ఘటాభిషేకం జరిపించారు. సుమారు 30మంది మహిళలు బిందెలతో నీటిని తరలించారు. ముందుగా క్షీరాభిషేకం చేసి నీటితో అభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు, రామక్ష్మి దంపతులు, గజపతినగరం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఎస్.విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సభ్యత్వాలు త్వరతగతిన పూర్తిచేయాలి
నెల్లిమర్ల, నవంబర్ 15: టీడీపీ సభ్యత్వాలను త్వరతగతిన పూర్తి చేయాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో రవిశేఖర్, రాజారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి త్వరతగతిన పూర్తిచేయాలని కోరారు. ఈ నెల 27న విజయనగరంలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు విరామంలేకుండా పనిచేయాలని అన్నారు. రాబోయే సార్వాత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, నాయకులు బైరెడ్డి నాగేశ్వరరావు, పోతల రాజప్పన్న, నల్లం శ్రీనివాసరావు, గొంతు రమణ, గురాన అసిరినాయుడు, కోటపాటి తిరుపతిరావు, అవనాపు సత్యనారాయణలు పాల్గొన్నారు.