విజయనగరం

వసతి గృహంలో కానరాని సదుపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ,నవంబర్ 18: మండల కేంద్రమైన పూసపాటిరేగ బిసి బాలుర వసతి భవనంలో సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. భవనాలు పురాతనమైనవి కావడంతో అవికూలే స్థితిలో ఉండడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో విద్యార్థులు చదువు సంధ్యలతోపాటు నిద్రహారాలు కూడా ఆరుబయటే చేస్తున్నారు. ఉన్న మరుగుదొడ్లు కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో 80మంది వరకు ఉన్న విద్యార్థులు ఆరుబయటే బహిర్భూమికి వెళ్ళాల్సిన గత్యంతరం ఏర్పడింది. రాత్రి సమయంలో ఆరుబయటకు విద్యార్థులు వెళుతుండడంతో విష సర్పాలు కాటువేస్తాయేమోనన్న భయం వారిలో వెంటాడుతుంది. కనీసం తాగేందుకు నీరుకూడా లేకపోవడంతో విద్యార్థులకు చేతిబోరే ఆధారంగా మారింది. వంటలు చేసేందుకు కూడా ఇదే నీటిని వినియోగించడంతో పలు అనారోగ్యాలకు గురతువున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సమస్యలు వేధిస్తున్నా సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.
============

ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి
* ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు

నెల్లిమర్ల, నవంబర్ 18: విజయనగరంలో ఈ నెల 27న నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మపోరాట దీక్షకు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని అన్నారు. దీక్షకు తరలిరావడానికి రవాణా సదుపాయం కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలో మా నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఇంకా సభ్యత్వ నమోదుకాని గ్రామాల్లో వేగవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను నాయకులు, కార్యకర్తలు జనవంలోకి తీసుకువెళ్ళి 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అత్యంత మెజార్టీ సాధించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల సమస్యలపై చర్చ జరిపారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, మండల శాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు, భోగాపురం సిహెచ్‌సి చైర్మన్ పతివాడ తమ్మినాయుడు, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం ఎంపీపీలు సువ్వాడ వనజాక్షి, కంది చంద్రశేఖర్, కర్రోతు బంగారురాజు, డెంకాడ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, నాయకులు లెంక అప్పలనాయుడు, బైరెడ్డినాగేశ్వరరావు, ఆదినారాయణ మాస్టారు, పోతల రాజప్పన్న, గురాన అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
============

సిఎం సహాయనిధి మంజూరు పత్రాలు పంపిణీ

నెల్లిమర్ల,నవంబర్ 18: ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4.52వేలు విలువైన మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు రోగులకు అందజేశారు. ఆదివారం ఎమ్మెల్యే పతివాడ నెల్లిమర్లకు చెందిన గంగాదేవి, పొట్నూరు అప్పన్న, డెంకాడ మండలానికి చెందిన గెద్ద అప్పలస్వామికి శస్తచ్రికిత్స నిమిత్తం 4.52వేలు విలువైన సి ఎం సహాయనిధి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేదలైన రోగులకు సి ఎం సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్,మండల శాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు, ఎంపిపి సువ్వాడ వనజాక్షి, కంది చంద్రశేఖర్, కర్రోతు బంగారురాజు, జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
=============

కలుషిత నీటితో చేపలు మృతి

గజపతినగరం, నవంబర్ 18: నియోజవర్గ కేంద్రమైన గజపతినగరంలోని కోనేటి చెరువులో కలుషిత నీటి వలన చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు తెలిపారు. ఆదివారం చెరువులో మృతి చెందిన చేపలను మత్స్యకారులు బయటకు తీసి తొలగించారు. గత కొద్దిరోజులుగా మృతిచెందిన చేపలతో పరిసర ప్రాంతాలలో గల వారు దుర్గంధభరిత వాసన తట్టుకోలేక పంచాయతీ కార్య నిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవొ రామకృష్ణ ఆదేశాల మేరకు మత్స్యకారులు యుద్దప్రాతిపదికన మృతి చెందిన చేపలను తొలగించారు. పంటపొలాలలో విపరీతంగా పురుగు మందులు వాడటం ద్వారా నీరు కలుషితం కావడంతో చేపలు చనిపోయి ఉండవచ్చని పలువురు తెలిపారు.
==========

వనమిత్రలో పిక్నిక్ సందడి

బొండపల్లి, నవంబర్ 18: కార్తీకమాసం తొలి ఆదివారం కావడంతో సామాజిక అటవీశాఖకు చెందిన వనమిత్రలో పిక్నిక్ సందడి నెలకొంది. గజపతినగరం పొట్టావారి వీధికి చెందిన 17 కుటంబాలకు చెందిన 70మంది సభ్యులు పిక్నిక్ సందర్భంగా పలు ఆటలు, పాటలతో ఆనందంగా గడిపారు.మహిళలు ముందుగా వాసవీమాతకు పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలు సినీ నృత్యాలతో పలు గీతాలు ఆలపిస్తూ ఉర్రూతలూగించారు. అదే విధంగా వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులతో వనమిత్ర కళకళలాడింది. ఇటీవల ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అత్యంత సుందరంగా, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.
==============

విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు

బొండపల్లి, నవంబర్ 18: జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను పురష్కరించుకొని ఆదివారం బొండపల్లి శాఖా గ్రంధాలయంలో విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బొండపల్లి గ్రంధాలయ అధికారి పి.నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులను ఈనెల 20వ తేదిన జరిగే ముగింపు వారోత్సవాలలో అందజేస్తామని తెలిపారు.
==============

27 మద్యం సీసాలు స్వాధీనం
బొండపల్లి, నవంబర్ 18: మండలంలోని గొల్లలపేట, అంబటివలస సమీపంలో ఇటీవల వ్యక్తుల నుండి 27 మద్యం సీసాలను బొండపల్లి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.