విజయనగరం

అగ్రిగోల్డ్ బాధితులతో చంద్రబాబు చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 18: అగ్రి గోల్డ్ బాధితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెలగాటం ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ నాయకుడు బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన స్వలాభం కోసం అగ్రిగోల్డ్ సంస్ధను నిర్వీర్యం చేసి లక్షలాది మంది ఖాతాదారుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని తెలిపారు. గజపతినగరం నియోజవర్గంలో సుమారు 50వేల మంది ఖాతాదారుల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారు అయ్యాయని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే అగ్రి బాధితులకు న్యాయం జరుగుతుందనే ప్రజావాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌కు సంబంధంలేదని చెప్పడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎంత అవినీతిగా మారిందో తెలుస్తోందన్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడివెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. జగన్‌పై దాడి వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా జరిగిందని అన్నారు. చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసత్య మాటలు ఆడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే దాడిపై స్వతంత్ర కేంద్ర సంస్ధతో దర్యాప్తు చేయాలని లేని పక్షంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పాత చట్టాలను వాడుకుంటున్నారని విమర్శించారు. జగన్మోహనరెడ్డి ధైర్యంగా సిబిఐ దర్యాప్తును ఎదుర్కొన్నారని, మరి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ, పోలవరం, రాజధానిర్మాణం, విశాఖ భూకుంభకోణం వంటి కుంభకోణాలతో ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. సిబిఐ దర్యాప్తుచేస్తే ఈ అక్రమాలు బయట పడతాయనే అడ్డుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ గార తవుడు, మాజీ ఎ ఎంసి చైర్మన్ పల్లి సంజీవరావు, పి ఎ సి ఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, వైకాపా నాయకులు మండల సురేష్, బెల్లాన త్రినాధరావు, దొగ్గ దేవుడునాయుడు, ఆల్తి రామునాయుడు, సింహాద్రిప్పుడు, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలు హుందాగా చేసుకోవాలి

గజపతినగరం, నవంబర్ 18: రాజకీయాలు హుందాగా చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు అన్నారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల
పార్టీని వీడి టీడీపీలో చేరిన గోపాలరాజు వాస్తవాలు తెలుసుకోకుండా తనపై ఆరోపణలు, అనుచితవాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. మాజీ సైనికోద్యోగు సంక్షేమం ద్వారా అప్పటి ఎంపి బొత్స ఝాన్సీ ద్వారా జిల్లాలోని 352మంది మాజీ సైనికోద్యోగులకు గాజులరేగలో ఇళ్ల స్ధలాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని నియోజవర్గంలో తన గురించి ప్రజలకు బాగా తెలుసునని తెలిపారు. రాజకీయాలు హుందాగా చేయాలి గాని వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. బీజేపీ పేదప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. విభజన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నదని, రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రం ఇచ్చే నిధులుపైన సరియైన లెక్కలు చూపడం లేదన్నారు. కార్యక్రమంలో స్వచ్చ్భారత్ జిల్లా అధ్యక్షుడు ఆరిశెట్టి రామకృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.