విజయనగరం

అపూర్వ శిల్పకళా సంపద జయితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 18: శిల్పకళలకు నిలయంగా జయితి గ్రామం మారింది. మెంటాడ మండలంలోని జయితి గ్రామం శిల్పకళలకు ప్రసిద్ధిగాంచింది. శిలతో నిర్మించి తరతరాలుగా ఉన్న శిల్పగోపురాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. దీంతో జిల్లా ప్రజలే కాకుండా విదేశీయులు ఎక్కువ మంది ఈ శిల్పకళను చూడటానికి జయితి గ్రామం వస్తున్నారు. ఉత్తరాంద్రలో అపూర్వ శిల్పకళా సంపద ఉన్న దేవాలయాలలో జయితి శ్రీ భ్రమరాంభిక మల్లిఖార్జున ఆలయం ఒకటి. శిల్పకళలను ఎవరు రూపొందిచారన్న విషయంలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేవతలచే ఈ శిల్పకళలు నిర్మించబడ్డాయని కొన్ని పురాణకధలు చెబుతున్నాయి.
జయితి అని పేరు ఎలా వచ్చింది: ఈ గ్రామానికి జయితి అనిపేరు ఏలా వచ్చిందన్న దానిపై పూర్వీకులు చెప్పే కధనం ఇలా ఉంది. పూర్వం ఇంద్రుడు కుమారుడు జయంతుడు యుద్ధానికి సన్నద్దమవుతూ ఆ యుద్ధంలో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఈ దేవాలయాన్ని నిర్మించారన్నది ఒక కధనం. జయంతుడు నిర్మించిన ఆలయాలు ఉన్న గ్రామం కనుక దీనికి (పిలవబడుతున్నదని) పూర్వీకులు చెబుతుంటారు.

శిల్పాలలో ముఖ్యమైనవి ఇవి: జయితిలో ఉన్న శిల్పాలలో ముఖ్యంగా రెండు గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలు చుట్టూ అనేక శిల్పాలు ఉన్నాయి. వీటిలో వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, కుమారస్వామి, తదితర విగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు తొమ్మిది చేతుల నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఆదిపరాశక్తి రుద్ర నాట్యం చేస్తూ ఉన్న విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటుంది. అలాగే శిరస్సులేని కొన్ని విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి అయ్యప్పస్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఈ పరిసరాలలో ఉత్తరాన కొండపైన శివపార్వతుల ఆలయం ఉంది.

బంగారులోయ: జయితి శిల్పకళల తరువాత ప్రజలు, భక్తులు చూడ తగినది బంగారులోయ. కొండకు ఉత్తర దిశలో ఉన్న శివపార్వతుల ఆలయం పర్వతం వద్ద ఉన్నలోయను బంగారులోయగా పిలుస్తారు. ఈ బంగారు లోయ నుంచి వెళితేనేరుగా కాశివరకూ వెళ్ల వచ్చునన్నది పూర్వీకులు కధనం. అయితే ప్రస్తుతం సరైన మార్గం లేదని పరిశీలకులు తేల్చిచెప్పడం జరిగింది.

మల్లిఖర్జునస్వామి ఆలయం: మల్లిఖార్జునస్వామి ఆలయానికి గొప్ప విశిష్టత ఉంది. కొన్ని వందల దశాబ్ధాల కిందట ఇక్కడ ఒక శివలింగం ఏర్పడింది. ఈ శివలింగాన్ని గ్రామస్ధులు రుబ్బురోలుగా భావించి పిల్లలు ఆడుకునేవారట. కాలక్రమేనా అది ప్రతి ఏడాది కార్తీకమాసానికి కొద్దికొద్దిగా పెరుగుతూ ఉండటంతో గ్రామస్ధులు గుర్తించారు. ఇది రుబ్బురోలుకాదు సాక్షాత్తు శివుని రూపమైన శివలింగమని కొలిచారు. ఆ శివలింగం వెలసిన స్ధానంలోనే ఆలయాన్ని నిర్మించారు. మల్లిఖార్జునస్వామి ఆలయంలో భక్తులు ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు. కోర్కెలు తీరుతాయన్న నమ్మకంతో ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు అనేక శిల్పాకళా ఖండాలు ఉన్నాయి. రాతితో నిర్మించిన గోడలకు అనేక విగ్రహాలు ఉన్నాయి.

శివరాత్రి, కార్తీకమాసంలో భక్తులు తాకిడి: శివరాత్రి, కార్తీకమాసంలో ప్రతి ఏడాది భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. మామూలు రోజులలో అంతంత మాత్రంగా ఉండే భక్తులు, ప్రజలు కార్తీకమాసం, శివరాత్రి వచ్చిందంటే ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. కార్తీకమాసంలో శివ మాలధారణ, అయ్యప్ప మాలధారణ చేస్తూ నిత్యపూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయగోడలు పగుళ్ళు రావడంతో పంచాయతీ నిధులు మూడు లక్షలతో మరమ్మతులు చేపట్టారు.

విఘ్నేశ్వర గోపురం నిర్మాణం: అప్పట్లో విఘేశ్వరగోపురం శిధిలం కావడంతో పురావస్తుశాఖ వారు 25లక్షలు నిధులతో పునర్నిర్మాణం చేపట్టి పూర్తిచేశారు. శిల్పకళలతో ఉన్న ఈ గోపురం నిర్మాణానికి నైపుణ్యం కలిగిన శిల్పకళకారులు వచ్చి నిర్మాణం చేపట్టారు.

శిధిలావస్ధలో పార్వతీదేవి గోపురం: అపూర్వ శిల్ప సంపద ఉన్న గోపురం పార్వతీదేవి గోపురం. ఈ గోపురం పూర్తి శిధిలావస్ధలో ఉండడంతో భక్తులు పూజలు చేసేందుకు భయబ్రాంతులు చెందుతున్నారు. గోపురంలోనికి వెళ్ళి దీప నైవేద్యాలు పెట్టుటకు భక్తులు, అర్చకులు భయబ్రాంతులకు లోనవుతున్నామని ఆరోపిస్తున్నారు. సంబంధింత అధికారులు శిల్పకళా గోపురాలు చెక్కు చెదరకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

పరాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే: జయితి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది విదేశీ సందర్శకులు వస్తారు. సినిమా, టి.వి షూటింగ్‌లు నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వెచ్చించవచ్చు. అంతే కాకుండా గ్రామంలో కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందనేది ఆ ప్రాంతవాసుల అభిప్రాయం. సంబంధిత అధికారులు ఆ దిశగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.