విజయనగరం

మానవజీవన విధానమే సంస్కృతి సంప్రదాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్),మే12: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలే మానవజన్మ జీవన విధానమని విశ్రాంత సంస్కృత విభాగాధిపతి అక్క్భుట్ల శర్మ అన్నారు. పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలోగురువారం దశదిన సంస్కృత శిక్షణ శిబిరం ముగింపుకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా శర్మ మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ శిబిరాల నిర్వహణవల్ల విద్యార్ధులకు చక్కని ఉచ్ఛారణ, భాషాపటిమ కలుగుతుందని చెప్పారు. తెలుగు,సంస్కృత భాషల్లో స్పష్టమైన ఉచ్ఛారణతో మాట్లాడవచ్చునని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నహైందవి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుండి పురాణ, ఇతిహాసాలను చెప్పడం ద్వారా వాటిలోని గొప్పదనాన్ని వారు గ్రహిస్తారని అన్నారు. దశదిన సంస్కృతశిక్షణా శిబిరంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా అక్క్భుట్ల శర్మను ఘనంగా సత్కరించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలను, దృవపత్రాలను అందచేసారు. ఈకార్యక్రమంలో శ్రీవేంకటేశ్వర ఆధ్యాత్మిక భక్తమండలి పూర్వాధ్యక్షుడు దేవరాజు గోపాలకృష్ణ, బాలకేంద్రం పర్యవేక్షకుడు బుర్రాశ్రీనివాసరావు, రంగాచార్యులు అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు.

ధనలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజలు
విజయనగరం(పూల్‌బాగ్),మే 12: దుప్పాడ గంగానగర్‌లోని అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువైన ధనలక్ష్మీ అమ్మవారికి గురువారం విశేషపూజలు జరిపారు.ప్రత్యేక కుంకుమపూజలు చేసారు. ఈసందర్భంగా వేకువజామున అమ్మవారికి నిత్యపూజలనంతరం ప్రత్యేక అభిషేక, అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి సహస్రార్చన కార్యక్రమం జరిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.