విజయనగరం

వైభవంగా ఏకన్యాస రుద్రాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 6: గజపతినగరంలోని ఉమారామలింగేశ్వర గ్రూపు దేవాలయాల ప్రాంగణంలో గల సత్యసాయి గీతామందిరంలో నిర్వహించిన ఏకన్యాస రుద్రాభిషేకం వైభవంగా జరిపారు. గురువారం సత్యసాయి సేవాసమితి సీనియర్ నాయకులు పొట్టా శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ రుద్రాభిషేకం జరిపారు. ప్రజలకు స్వామి ఆశీర్వాదాలు ఉండాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నిమ్మలపాలెంలో స్వైన్‌ఫ్లూ మందులు పంపిణీ
కొత్తవలస, డిసెంబర్ 6: మండలంలోని నిమ్మలపాలెం గ్రామంలో 295మందికి ఉచితంగా స్వైన్‌ఫ్లూ మందులు పంపిణీ చేశారు. గురువారం మండలంలోని వియ్యంపేట పిహెచ్‌సి హెల్త్ అసిస్టెంట్ ఎల్.సత్యారావు ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేపట్టారు. ఈ సీజన్‌లో జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వస్తాయని చెప్పారు. జ్వరతీవ్రతను బట్టి వైద్యుల సలహామేరకు మందులు వాడాలన్నారు. ప్రాధమిక పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు జి.దుర్గా ఉమేష్, హెచ్ ఎం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తాటిపూడిని సందర్శించిన పొరుగురాష్ట్రాల ప్రతినిధులు
గంట్యాడ, డిసెంబర్ 6: ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిపూడిని పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు గురువారం సందర్శించారు. తాటిపూడిలోని ప్రకృతి అందాలను తిలకించి అక్కడి అందాలపై డాక్యుమెంటరీని రూపొందించారు. ఈసందర్భంగా జిల్లా పర్యటకశాఖ, సంస్కృతికి శాఖ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని చారిత్రాత్మిక, వారసత్వ సంపద, సంస్కృతిక అంశాలపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్యాకుమెంటరీని రూపొందించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకులు సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మశ్చిమబెంగాల్, మద్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన 22మంది ప్రతినిథులు చేపట్టిన సైకిల్‌యాతను గత నెల 16వ తేదీలో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుజెండా ఊపి ప్రారంభింరని తెలిపారు. తెలుగురాష్ట్రాల ప్రతినిధులు రాష్ట్ర్యంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శికి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గురువారం అరకు ఎక్కి థైడా మీదుగా తాటిపూడికి సైకిల్‌యాత్ర నిర్వహిచారని అన్నారు. పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ది చేయడంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ పర్యాటక అభివృద్ధి పథంలోపాటు రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకే పొరుగురాష్ట్రాల ప్రతినిధులు సైకిల్ యాత్రతో డాక్యుమంటరనీనిరూపందిస్తామని అన్నారు.

8న ఎస్పీ జాతీయ కమిషన్ సభ్యులు పర్యటన
విజయనగరం, డిసెంబర్ 6: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు కె. రాములు ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి బయలు దేరి ఉదయం 11 గంటలకు విజయనగరం చేరుకుంటారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు తిరిగి విశాఖ చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విజయనగరం, డిసెంబర్ 6: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, సీనియర్ కౌన్సిలర్ రాజేష్ పిలుపునిచ్చారు. గురువారం ఆరో వార్డు కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసి ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కౌశిక్, రెడ్డి బంగారునాయుడు, ముద్దాడ మధు తదితరులు పాల్గొన్నారు.

శంకర్రావు కుటుంబాన్ని పరామర్శించిన వైకాపా నేతలు
చీపురుపల్లి, డిసెంబర్ 6: అగ్రిగోల్డు ఏజెంటు రాపర్తి శంకర్రావు కుటుంబసభ్యులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వివాదంతో ఎంతో మంది అమాయకులు మృతిచెందుతున్నారని, ఇటువంటివారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అగ్రిగోల్డ్ వివాదాన్ని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివాద పరిష్కారంలో జాప్యం జరిగే కొద్ది అగ్రిగోల్డ్ బాధిత మృతుల సంఖ్య పెరుగుతునే ఉంటుందన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంత్, ఇప్పిలి తిరుమల, గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.