విజయనగరం

పోలీసులకు ధీటుగా హోంగార్డుల సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 6: పోలీసులకు ధీటుగా హోంగార్డులు సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ పాలరాజు అన్నారు. గురువారం హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు పెరేడ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంగార్డులలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వారని, అందువల్లనే ప్రభుత్వం వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే వేతనాలు పెంచారని, చంద్రన్న బీమా ద్వారా రూ.5 లక్షలు, ఈ ఏడాది వేతనం పెంచడం, కేస్ లెస్ హెల్త్ ట్రీట్‌మెంట్ వంటి సౌకర్యాలు కల్పించిందన్నారు. త్వరలో వారికి ఇళ్లు, బస్ పాస్‌ల వంటి రాయితీలు కల్పించేందుకు ప్రభుత్వం యోచనలో ఉందన్నారు. హోంగార్డులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ నరసింహరావు, పిటిసి ప్రిన్సిపల్ మెహర్‌బాబు, ఒఎస్డీ జె.రామమోహనరావు, డిఎస్పీలు ఎల్.శేషాద్రి, డి.సూర్య శ్రావణ్‌కుమార్, ఎం.శ్రీనివాసరావు, కె.కుమారస్వామి, త్రినాద్, చక్రవర్తి, ఇత సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు పరిశీలిస్తా!
* వేతన స్ధిరీకరణ కమిషనర్ అశుతోష్ మిశ్రా

విజయనగరం, డిసెంబర్ 6: 11వ వేతన స్థిరీకరణకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లను పరిశీలిస్తానని కమిషనర్ అశుతోష్ మిశ్రా చెప్పారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ సంఘాల నుంచి డిమాండ్లను స్వీకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు శాఖల డిమాండ్లను పరిశీలించారు. 2018 పిఆర్సీలో 40 శాతం ఫిట్‌మెంట్ కావాలని, ఇంటి అద్దె భత్యం 25 శాతం పెంచాలని, పదోన్నతులలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖలో రిస్క్ అలవన్స్‌లు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు 11 వినతులు, వైద్య సంఘాల అసోసియేషన్లు పది వినతులు, జెఎసి అమరావతి 2 వినతులు, దివ్యాంగ సంస్థల నుంచి 11 వినతులు, సమాచార పౌరసంబంధాల శాఖ నుంచి ఒక వినతి, నాల్గోతరగతి ఉద్యోగ సంఘాల నుంచి ఒక వినతి, విఆర్వో సంఘం ఒక వినతి, ఎపిహెచ్‌ఎంఎస్ ఒక వినతి, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఒక వినతి కలిపి మొత్తం 57 వినతులను కమిషనర్‌కు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వినతులన్నింటిని క్రోడీకరించి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
రైతుల గుండెల్లో గుబులు రేపుతున్న మబ్బులు
గజపతినగరం, డిసెంబర్ 6: గత రెండు రోజులగా మబ్బులు రైతుల గుండెలలో గుబులు రేపుతున్నాయి. అసలే ఈ ఏడాది అంతంతమాత్రంగా పండిన వరి ఈ మబ్బులు అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఖరీప్‌లో అరకొరగా వర్షాలు కురవడంతో అనుకొన్నస్ధాయిలో వరినాట్లు పడలేదు. వేసిన పంటకు కొన్ని ప్రాంతాలలో ఆఖరి సమయంలో వర్షాలు కురవకపోవడం వలన అదే విధంగా సుడిదోమ తెగులు వలన వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. ఇటీవల రైతులు కోసిన వరిపంటను పొలాలల్లో ఆరబెట్టుకొన్నారు. అయితే బుధవారం నెల్లూరు జిల్లాలో వర్షాలు కురవడంతోపాటు జిల్లాలో మబ్బులు వేయడంతో రైతులు ఉరుకులు పరుగులతో కోసిన వరి పంటను ఆ పొలాల్లోనే దిబ్బలు వేసుకొని నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది రైతులకు వరిపంటకు అనుకూలంగా లేదనే చెప్పాలి.

అణగారినవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
* పలువురు వక్తల వెల్లడి
గజపతనగరం, డిసెంబర్ 6: అణగారినవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గజపతినగరం అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ అధ్యక్ష, కార్యదర్శిలు నరవ వీరాస్వామి, పొట్నూరు పుష్పనాధంలు అన్నారు. గురువారం అంబేద్కర్ వర్ధంతిని పురష్కరించకొని గజపతినగరం జాతీయ రహదారి పక్కన, ఎస్సీ కాలనీలలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. నాడు రాజ్యాంగంలో రూపొందించడం ద్వారా నేడు అన్నిస్ధాయిలలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరించడానికి అందరూ ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి, ఉపాధ్యక్షుడు నరవ ఈశ్వరరావు, ఎస్సీ సెల్ కన్వీనర్ నరవ అప్పలస్వామి, చైర్మన్ ఎ.చంద్రశేఖర్, కోశాధికారి పి. ఆదినారాయణ, మాజీ ఎంపిటిసి ఆల్తి రామునాయుడు, నరవ శంకరరావుతదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచంలోనే మహనీయుడుగా పేరుగాంచారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎంఎస్‌ఎన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో అంబేద్కర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సంఘం మండల కన్వీనర్ శీర వాసుదేవరావుపర్యవేక్షణలో జరిపారు. కార్యక్రమంలో బొండపల్లి మండల కన్వీనర్ మీసాల కుమార్, పాఠశాల కరస్పాండెంట్ డి.వి. ఎస్.రాజ్‌గోపాల్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

అంబేద్కర్ అందరివాడు
బొండపల్లి, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ అందరివాడని తహశీల్ధార్ డి.శేఖర్ అన్నారు. గురువారం మండల సముదాయం వద్దగల అంబేద్కర్ విగ్రహానికి ఎస్ ఐ పూడి వరప్రసాద్‌తో కలసి తహశీల్ధార్ శేఖర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళిత నాయకుడు బగ్గ ఎర్రయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అన్నికులాలు, వర్గాలను దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. కుల,మతాలు మనం సృష్టించుకున్న అడ్డుగోడలన్నారు. సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. ఎస్ ఐ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ మేధావులలో అంబేద్కర్ ఒకరన్నారు. నిమ్నవర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో పాటుపడ్డారన్నారు. అంబేద్కర్ ఆశయాలు ప్రస్తుత కాలంలో మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కూనిబిల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
కొత్తవలస, డిసెంబర్ 6: మండలంలోని అంబేద్కర్ 62వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారిణి జి.శ్రీదేవి ఆధ్వర్యంలో తాడివానిపాలెం ప్రాధమిక పాఠశాలలో వర్ధంతి జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ ప్రజల గుండెలలో సజీవంగా ఉన్నారన్నారు. కొత్తవలస డాబాలు పాఠశాలలో పి ఆర్‌టియు అధ్యక్షుడు చుక్క ఈశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీనవర్గాలు, అట్టడుగు అణగారిన, నిమ్నజాతుల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలను విద్యార్ధులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతోపాటు ఎ ఎస్ ఐ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

నారుూ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి
బొండపల్లి, డిసెంబర్ 6: నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం మండలశాఖ అధ్యక్షుడు పొట్నూరు దేవుడు అన్నారు. గురువారం మండల సముదాయం వద్ద మండలంలోని నాయి బ్రాహ్మణులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన దేవుడు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పధకాలను అందించేందుకు తనవంతు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నాయి బ్రాహ్మణులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. సంఘం అధ్యక్షునిగా పొట్నూరు దేవుడు, ఉపాధ్యక్షునిగా జి.సింహాచలం, కార్యదర్శిగా సూరిబాబు, గౌరవ అధ్యక్షునిగా ఎ. అప్పారావు, కోశాధికారిగా పొట్నూరు ఎర్రయ్య, సహకోశాధికారిగా వెంపడాపు ఎల్లయ్య, సహ కార్యదర్శిగా గౌరి, సహ అధ్యక్షునిగా పి.అప్పన్న, కార్యవర్గ సభ్యులుగా కె.పెంటయ్య, రమణ, ఆనంద్, కృష్ణలను ఎన్నుకొన్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్నిగ్రామాల నుండి నాయి బ్రాహ్మణులతోపాటు పూర్వపు అధ్యక్షుడు తోటపల్లి పాపారావు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ సేవలు అమలపై సంతృప్తి
గజపతినగరం, డిసెంబర్ 6: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సేవల అమలుపై గజపతినగరం ఐసిడి ఎస్ సిడిపివొ కె.రమణమ్మ సంతృప్తివ్యక్తం చేశారు. గురువారం మండలంలోని గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురం-2 కేంద్రంతోపాటు కాళంరాజుపేట, డోలపాలెం గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలను సిడిపివొ రమణమ్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు నుండి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సకాలంలో లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు కేంద్రంలో ఫ్రీ స్కూల్ ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్నందుకు సంతృప్తివ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.