విజయనగరం

మమ్మల్ని నమ్మండి.. నిబంధనలు సడలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 8: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలంటే నిబంధనలను సడలించాలని మిల్లర్లు మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శివ మాట్లాడుతూ మమ్మల్ని నమ్మి గతంలో మాదిరిగా నిబంధనలు ఉండేలా చూడాలని కోరారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 1:4 బ్యాంకు గ్యారంటీకి వెసులుబాటు కల్పించాలన్నారు. ఇతర జిల్లాల్లో 1:1 బ్యాంకు గ్యారంటీలు అందజేస్తున్నప్పటికీ, ఈ జిల్లాలో తమకు తలకు మించిన భారంగా ఉంటుందన్నారు. అలాగే కస్టడీ నిర్వహణకు క్వింటాలుకు రూ.4 చొప్పున చెల్లిస్తామన్న మొత్తాన్ని ఏప్రిల్ వరకు నిలిపివేయకుండా ముందుగా చెల్లించాలన్నారు. అలాగే ఒక శాతం డ్రయర్ చార్జీలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు, ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తితే దానికి ఆర్బిట్రేటర్‌గా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను అగ్రిమెంట్‌లో పొందుపరిచారని, అలా గాకుండా ధర్డ్ పార్టీ వారిని ఉంచాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఖరీఫ్‌నకు సంబంధించి 99.1 శాతం సిఎంఆర్ బియ్యాన్ని అప్పగించామని, మిగిలిన నాలుగువేల టన్నుల బియ్యాన్ని మరో ఐదు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఈ మిల్లులపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను లక్షమంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. డిసిసిబి కూడా బ్యాంకు గ్యారంటీకి రూ.40 లక్షల వరకు పరిమితం చేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు.
దీనిపై స్పందించిన మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకే నిబంధనలు ఉన్నాయని అన్నారు. కాకపోతే బ్యాంకు గ్యారంటీ విషయాన్ని పౌరసరఫరాలశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గత ఏడాది మాదిరిగాకాకుండా ఈ ఏడాది సంక్రాంతికి ముందర రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అలాగే మీకు అభ్యంతరం ఉన్న అంశాలను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ షర్మిలాకు ముందుగా అందజేయమని మంత్రి సుజయ్‌కృష్ణ మిల్లర్లకు వివరించారు. జెసి కెవి రమణారెడ్డి మాట్లాడుతూ నిబంధనలు చూసి భయపడతారెందుకని ప్రశ్నించారు. అది డిఫాల్టర్లకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వనిదే తాము మిల్లింగ్‌నకు ధాన్యాన్ని సరఫరా చేయలేమని జెసి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ షర్మిలా మిల్లర్ల సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.

చంద్రబాబు చేతుల మీదుగా పదివేలమందికి పట్టాల పంపిణీ
* జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు
గజపతినగరం, డిసెంబర్ 8: జిల్లాలో పదివేల మంది లబ్ధిదారులకు ఇండ్లస్ధలా పట్టాలు ఈ నెలాఖరున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందజేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అన్నారు. శనివారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో డి ఆర్‌వొ వెంకటరావు విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెలాఖరున జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమం ఉందని, ఆ కార్యక్రమంలో ఇండ్ల స్ధలాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను పంపిణీకి అవసరమైన పదివేల పట్టాలను సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే రెండువేల ఎకరాల భూపంపిణీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భూధార్‌కు సంబందించి 74శాతం పూర్తి చేశామని, ఈ నెలాఖరుకు 80శాతం పూర్తి చేస్తామని తెలిపారు. వీటిలో 26లక్షల సబ్‌డివిజన్స్ ఉన్నట్లు చెప్పారు. నోషనల్ ఖాతాల డిస్పోజల్స్ త్వరితగతిన చేపడుతున్నామని అన్నారు. ఆన్‌లైన్‌లో భూములు నమోదుకు సంబందించి అక్రమాలకు పాల్పడే కంప్యూటర్ ఆపరేటర్స్‌పై కఠినచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల పూసపాటిరేగలో ఒక ఆపరేటర్‌ను తొలగించడం జరిగిందని అన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. దీనికి ఏ ఒక్కరూ మినహాయింపు కాదని, బాధ్యులైన వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. సాదాబైనామాల నమోదుకు జిల్లాలో లక్షా 30వేల ధరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి సంబందించి 55శాతం డిస్పోజల్ చేసామన్నారు. కొన్ని ధరఖాస్తులు తిరష్కరించామని చెప్పారు. డి.పట్టా భూముల విక్రయాలు జరపరాదని, విక్రయించే వారిపై చర్యలు తప్పవన్నారు. 1806నుంచి 1954 సంవత్సరంనకు ముందున్న డి.పట్టా భూముల హక్కుల కల్పనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కొఠియా భూములకు సంబందించి సుప్రీంలో కేసు నడుస్తోందన్నారు. ఇనాం భూములకు సెటిల్‌మెంట్ పట్టాలు ఇవ్వాలని, దీనిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని అన్నారు. అనంతరం కార్యాలయంలో జమాబందీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్ధార్ బి.శేషగిరిరావు, ఉపతహశీల్ధార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఫోలిపాడ్యమి వేడుకలు
గజపతినగరం, డిసెంబర్ 8: మండలంలో ఫోలిపాద్యమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం పూర్తయిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ వేడుకలు జరుపుతుంటారు. తెల్లవారుజామునే లేచి తలంటిస్నానమాచరించి నీటిలో దీపాలు వెలిగించడంతోపాటు శివాలయాలు, శ్రీనివాస ఆలయాలను సందర్శంచి ప్రత్యేకపూజలు జరిపారు. గజపతినగరంలోని ఉమారామలింగేశ్వస్వామి ఆలయం, పురిటిపెంట గ్రామం పరిధిలో గల మల్లిఖార్జునస్వామి ఆలయం మండలంలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి.

దేదీప్యమానంగా దీపాల శివలింగం
గజపతినగరం, డిసెంబర్ 8: కార్తీకమాసం ఆఖరిరోజు కావడంతో గజపతినగరం ఉమారామలింగేశ్వస్వామి ఆలయంలో భక్తులు ఏర్పాటు చేసిన దీపాలతో శివలింగం అందరిని ఆకట్టుకున్నది. శుక్రవారం రాత్రి శివాలయం ప్రాంగణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలతో ఏర్పాటు చేసిన శివలింగం దేదీప్యమానంగా వెలిగింది. పరిసరప్రాంతాలలోని భక్తులు తరలించి అత్యంత భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకొన్నారు.

బీజేపీ ఇంటింటి ప్రచారం
గజపతినగరం, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పధకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు దేవర ఈశ్వరరావు కోరారు. శనివారం మండలంలోని కొత్తశ్రీరంగరాజపురం, లింగాలవలసలలో శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర నాయకులు ఈశ్వరరావు తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్భ్రావృద్ధికోసం కోట్లాది రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కేంద్ర నిధులతోనే గ్రామాలలో సిసి రహదారులు, కాలువలు నిర్మించడంతోపాటు ఉజ్వల గ్యాస్ పొయ్యిలు మహిళలకు ఉచితంగా అందించామని అన్నారు. నిరుపేదలకు ఇళ్లులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నిధులను చంద్రబాబు దారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో జరిగే ఎన్నికలలో బాబుకు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎం ఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కొత్తవలసను కరవుమండలంగా ప్రకటించాలి
కొత్తవలస, డిసెంబర్ 8: కొత్తవలస మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాబావ పరిస్ధితులు ఉన్నాయని తెలిపారు. కొన్ని జిల్లాలో అత్యధిక మండలాలను కరవు మండలాలగా ప్రభుత్వం ప్రకటించిందని, విజయనగరం జిల్లాను విస్మరించిందని మండిపడ్డారు. జిల్లాలో కేవలం నాలుగు మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడం విడ్డూరం అని అన్నారు. కరవు తీవ్రంగా ఉన్న మండలాలు సుమారు 24వరకు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని, ఉపాధి రోజులను 200కు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విదంగా రైతులకు పెట్టుబడి రాయితి కింద ఎకరాకు పదివేలు కరవు సాయం కింద 25వేలు, బ్యాంకు రుణాలు మాఫీ వంటి చర్యలు వెంటనే చేపట్టాలని అన్నారు. ఉపాధి కూలీల అంతా కలిసి ఎంపిడివొ కార్యాలయానికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సి ఐటియు డివిజన్ నాయకులు డేగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కొత్తవలస, డిసెంబర్ 8: జాతీయస్ధాయిలో పంజాబ్‌లో జరగబోవు ఆలిండియా వాలీబాల్ టోర్నమెంట్‌లో పొల్గొనదలచిన క్రీడాకారులు కొత్తవలసలో నిర్వహిస్తున్న శిక్షణా శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మూడు నుండి 16వరకు కొత్తవలసలో ఏపీ జూనియర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు జరుగుతుందని, అందులో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొని శిక్షణ పొందుతున్నట్లు అన్నారు. వీరంతా చండీఘర్‌లో జరగబోవు ఆలిండియా టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు జాతీయ వాలీబాల్ కోచ్ గవర సూరిబాబు, టీమ్ మేనేజర్ భగవాన్‌దాస్ పాల్గొని శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు దాతల సహకారంతో ఉచితంగా భోజన సదుపాయం, వసతి సదుపాయాలు కల్పిస్తునట్లు తెలిపారు.
సిరికి రచించిన మట్టిరంగు బొమ్మలు ఆవిష్కరణ
పార్వతీపురం, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గుంటూరులో జరిగిన 18వ రాష్ట్ర మహాసభల్లో పార్వతీపురానికి చెందిన కవి సిరికి స్వామినాయుడు రాసిన ‘మట్టిబొమ్మలు, కవితా సంకలనాన్ని అరసం జాతీయనేత , తెలుగుయూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఆవిష్కరించారు. అరసం అధ్యక్షులు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో అరసం బాధ్యులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ఏటుకూరి ప్రసాద్, సాకం నాగరాజు, ముత్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరికి స్వామినాయుడు మాట్లాడుతూ మట్టిరంగు బొమ్మలు తన రెండవ కవితా సంకలనమని ఉత్తరాంధ్ర వ్యయార్ధ జీవిత యధార్ధతను, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కొంతవరకు చెప్పగలిగానన్నారు. ఈ సభలో ఉత్తరాంధ్ర ప్రముఖ సాహితీవేత్తలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, జి ఎస్ చలం, బాలు, చింతా అప్పలనాయుడు, తదితరులు పాల్గొని సిరికి స్వామినాయుడును అభినందించారు.

నారాయణ పుష్కరిణిలో ఘనంగా దీపోత్సవం
బొబ్బిలి, డిసెంబర్ 8: పట్టణ పరిధిలో ఉన్న నారాయణ పుష్కరిణి(గుర్రపుకోనేరు) వద్ద హిందూ ఉత్సవ సమితి, సమరసతా సేవాసమితి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పోలిపాడ్యమి దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈమేరకు తెల్లవారుజాము 3గంటల నుంచి మహిళలు స్నానాలు ఆచరించి నారాయణ పుష్కరిణిలో దీపాలను భక్తిశ్రద్ధలతో వెలిగించి విడిచిపెట్టారు. అలాగే మండపం వద్ద ఏర్పాటు చేసిన దేవతామూర్తి విగ్రహాల వద్ద కూడా దీపాలు వెలిగించి విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా హిందూ ఉత్సవ సమితి, సమరసతా సేవాసమితి నిర్వాహకులు పెంట స్వామినాయుడు, ముట్నూరు వేణుగోపాలరావులు మాట్లాడుతూ పోలిపాడ్యమి సందర్భంగా ప్రతీ ఏడాది భక్తుల సౌకర్యార్థం నారాయణ పుష్కరిణిని సిద్ధం చేస్తున్నామన్నారు. పవిత్ర కార్తీకమాసం చివరి రోజు కావడంతో పోలమ్మ అనే దేవతను స్వర్గానికి పంపించాలన్న ఉద్దేశ్యంతో సంస్కృృతి సాంప్రదాయాల ప్రకారం మహిళలంతా తెల్లవారుజామునే దీపాలను వెలిగించి నదులు, చెరువులలో దీపాలను విడిచిపెట్టడం పరిపాటిగా మారింది. ఈ విధంగా పోలిపాడ్యమి నాడు పూజలు నిర్వహించడం వలన సుఖశాంతులతో వర్థిల్లగలరనే నమ్మకంతో తెల్లవారు జాము 3గంటల నుంచే భక్తులు బారులు తీరి పుష్కరిణి వద్ద దీపాలు విడిచిపెట్టి పూజలు చేశారు. కొంతమంది భక్తులు తెల్లవారు జామునే పెంట, కొత్తపెంట, సీతానగరం, పారాది, భోజరాజపురం తదితర ప్రాంతాలకు వెళ్లి సువర్ణముఖి, వేగావతి నదులలో పుణ్యస్నానాలు ఆచరించి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు పుల్లెల శ్రీనివాసరావు, చెలికాని కేశవ, దూపం వాసు, బాబూరావు, భక్తులు పాల్గొన్నారు.

కదలని గజరాజులు
గరుగుబిల్లి, డిసెంబర్ 8: మండలంలోని సంతోషపురం గ్రామసమీపంలో శనివారం అడవి ఏనుగులు పొలాల్లో తిష్టవేశాయి. గడిచిన నాలుగురోజుల నుంచి మండల పరిధిలోని ఆయాగ్రామాల్లో ఉన్న అరటి, చెరకు, వరి పంటలను ఏనుగులు నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల నుంచి ఖడ్గవలస, సంతోషపురం, తదితర ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆయాప్రాంతాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంతోషపురం అరటితోటలో సంచరిస్తున్నాయి. రెండు రోజులుగా ఈప్రాంతం నుంచి ఏనుగులు కదలకపోవడంతో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి నోట కొండబారిడి మాట
గరుగుబిల్లి, డిసెంబర్ 8: రాష్ట్రంలో తొలి 100శాతం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, 100శాతం శ్రీవరి సాధించిన కురుపాం మండలం కొండబారిడి గ్రామాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారని జట్టు ఎగ్జిక్యూటివ్ ట్రస్టు డి పారినాయుడు తెలిపారు. శనివారం నుంచి గుంటూరులో జరుగుతున్న పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం, పాలేకర్ శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన 100శాతం ప్రకృతి వ్యవసాయం చేసిన కొండబారిడి గ్రామంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించాలన్నారు. మారుమూల గిరిజన గ్రామమైన కొండబారిడి గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్టమ్రంతా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. ఇందుకు కారణమైన జట్టుట్రస్టు, జిల్లా డీపీఎం బృందం, వ్యవసాయశాఖలను ఆయన అభినందించారన్నారు.

అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా నవరత్నాల అమలు
తెర్లాం, డిసెంబర్ 8: రాష్ట్రంలో వై ఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా నవరత్నాల పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తానని బొబ్బిలి వైసీపీ నియోజకవర్గ సమన్వకర్త శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం తెర్లాంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి మద్ధతు తెలపాలని కోరారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో అవినీతి, అక్రమాలు, భూదందా, ఇసుకదోపిడి, వంటివి పెరిగిపోయాయన్నారు. అటువంటి పార్టీకి చరమగీతం పాడాలన్నారు. ప్రతీ ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేసి జగన్మోనరెడ్డిని గెలిపించేలా కృషి చేయాలన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీని ప్రజలు ఎల్లప్పుడూ గౌరవిస్తున్నారని, తమ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన సుజయ్‌కృష్ణరంగారావు స్వర్థప్రయోజనాల కోసం టీడీపీలోకి చేరడం రాజకీయాలకు విలువ లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్వసనీయత ఉంటే వైసీపీలో చేరిన వ్యక్తి ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి ఎన్నికల్లో నిలబెట్టి టీడీపీలో విజయసాధిస్తే మంత్రి పదవి ఇవ్వడం సమంజసమన్నారు. అంతేకానీ వేరొక పార్టీలో గెలిచి సొంత ప్రయోజనాలకోసం టీడీపీలోకి చేరడం సమంసజసమన్నారు. విజయనగరం పార్లమెంటరీ మహిళా సంఘం అధ్యక్షులు నర్సుపల్లి ఉమాలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణాలో ప్రచారానికి వెళ్లినప్పుడు కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను తీసుకున్నారని, వారిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసీలు బి అప్పలనాయుడు, తెంటు సత్యంనాయుడు, సుంకరి సాయి, పెంకి రామారావు, ఎస్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

2వ విడత పలకరింపు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తెర్లాం, డిసెంబర్ 8: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ విడత పలకరింపు కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు విజయవంతం చేయాలని తెర్లాం పిహెచ్‌సీ వైద్యాధికారి రెడ్డి రవికుమార్ కోరారు. ఈమేరకు శనివారం గంగన్నపాడు గ్రామంలో పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ విడత పలకరింపు కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలోని బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందజేయాలన్నారు. ఎవరైన వ్యాధుల భారిన పడితే వైద్యారోగ్య సిబ్బంది దృష్టికి తీసుకువెళితే వాటి నివారణకు చర్యలు చేపడతారన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ఆవరణలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ గంగునాయుడు, పిహెచ్‌ఎన్ రాగమణి, హెల్త్ విజిటర్ రోజామణి, ఏఎన్‌ఎం వెంకటి, అంగన్వాడీ కార్యకర్తలు రమణమ్మ, గర్భిణీలు, తదితరులు పాల్గొన్నారు.

శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారు
మక్కువ, డిసెంబర్ 8: శంబర శ్రీపోలమాంబ అమ్మవారి జాతర తేదీలను ఖరారు చేశామని దేవాదాయశాఖ కార్యనిర్వాహణ అధికారి ప్రకాష్ అన్నారు. స్థానిక శ్రీపోలమాంబ అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద ట్రస్టు బోర్డు కమిటీతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 జనవరిలో శంబర శ్రీపోలమాంబ అమ్మవారి జాతర నిర్వహించేందుకు తేదీలను నిర్ణయించామన్నారు. ఈమేరకు డిసెంబర్ 17వ తేదీన పెద్ద పోలమాంబ అమ్మవారిని గ్రామానికి తెచ్చేందుకు చాటింపు వేయనున్నామన్నారు. అలాగే 24వ తేదీన పెద్ద అమ్మవారిని గ్రామానికి తీసుకువస్తామని, 31వ తేదీన తొలేళ్ల ఉత్సవం, జనవరి 1వ తేదీన అమ్మవారి పండగ, 2వ తేదీన అనుపోత్సవం నిర్వహించనున్నామన్నారు. అదేరోజున చిన అమ్మవారిని తెచ్చేందుకు చాటింపువేస్తారన్నారు. జనవరి 7వ తేదీన చిన అమ్మవారిని గ్రామానికి తెస్తారన్నారు. జనవరి 21వ తేదీన చినపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, జనవరి 22వ తేదీన సిరిమానోత్సవం, 23వ తేదీన అనుపోత్సవం జరగనుందన్నారు. జనవరి 29వ తేదీన మారుజాతర జరుపుతామన్నారు. ఫిబ్రవరి 5 తేదీన మూడవ జాతర, ఫిబ్రవరి 12వ తేదీన నాల్గవ జాతర, ఫిబ్రవరి 19న 5వ జాతర, ఫిబ్రవరి 26వ తేదీన 6వ జాతర, మార్చి 5వ తేదీన 7వ జాతర, మార్చి 12వ తేదీన 8వ జాతర, మార్చి 19వ తేదీన 9వ జాతర, మార్చి 26న 10వ జాతర జరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు ఛైర్మన్ వసంతల భాస్కరరావు, ఆలయ కమిటీ సభ్యులు పూడి దాలినాయుడు, గంజి కాశీనాయుడు, తీళ్ల పోలినాయుడు, మాజీ ఇఓ నాగార్జున, గ్రామపెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిపథంలో అర్భన్ బ్యాంకు
* 50కోట్ల డిపాజిట్లతో స్వర్ణోత్సవ సంబరాలు * నేటితో 100 ఏళ్లు పూర్తి
సాలూరు, డిసెంబర్ 8: పట్టణ కో- ఆపరేటివ్ బ్యాంకు నేటితో 100 ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. పట్టణ ప్రజల నమ్మకమే పెట్టుబడిగా ఏర్పడిన స్థానిక కో- ఆపరేటివ్ బ్యాంకు ఆదివారంతో పూర్తిచేసుకోనుంది. వేలాదిమంది ఖాతాదారులతో 50కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ప్రగతిపథంలో నడుస్తుంది. పట్టణంలోని చిరువ్యాపారులకు చిన్న చిన్న రుణాలు ఇస్తు నెలవారీ వసూళ్లు చేపడుతూ అంచలంచెలుగా ఎదిగిన బ్యాంకు ఇది. సామాన్యులే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయి. 1918 డిసెంబర్ 8వ తేదీన ఆవిర్భావించిన ఈ బ్యాంకుకు తొలి అధ్యక్షునిగా అతి అప్పారావు పనిచేశారు. మొదటి కార్యదర్శిగా సిహెచ్‌ఏ నారాయణరావు పనిచేశారు. ది సాలూరు టౌన్ కో- ఆపరేటివ్ సొసైటీ పేరుతో మొదట ప్రారంభమై నేడు ది సాలూరు కో- ఆపరేటివ్ అర్భన్ బ్యాంకుగా విలసిల్లుతుంది. 100 సంవత్సరాలక్రితం 5వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైంది. మొదట 18మంది సభ్యులతో ఆరంభమై ఇప్పుడు 7,066మంది సభ్యులకు చేరింది. ప్రస్తుతం 5 ఏళ్లకొకసారి పాలకవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బ్యాంకు అధ్యక్షునిగా కూనిశెట్టిబీమారావు ఎన్నికయ్యారు. వీరితోపాటు 9మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే ధ్యేయంగా పాలకవర్గాలు పనిచేస్తున్నాయి. బీమారావు అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత బ్యాంకు ఆవరణలో ఏటీఎంను ప్రారంభించారు. 100 సంవత్సరాల స్వర్ణోత్సవ కార్యక్రమాలను కూడా ప్రస్తుత పాలకవర్గం హయాంలోనే జరుగుతుంది. ఆదివారం పట్టణంలోని మెంటాడవీది కోదండరామ కళ్యాణ మండపంలో స్వర్ణోత్సవ సంబరాలకు జిల్లామంత్రి ఆర్‌వి సుజయ్‌కృష్ణరంగారావు, జడ్పీ ఛైర్‌పర్సన్ స్వాతీరాణి, ఎమ్మెల్సీలు జగదీష్, జి సంధ్యారాణి, ఎమ్మెల్యే రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జి విజయకుమారిలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఎమిరిటర్ విశాఖపట్టణం కో- ఆపరేటివ్ బ్యాంకు ఎం ఆంజనేయులు, విశాఖ కో- ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, కనకమహాలక్ష్మి కో- ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ రఘునాధరావు, మహారాజ కో- ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ ఎంఆర్‌కె రాజులు హాజరుకానున్నారు.

అయ్యప్పస్వాముల నగర సంకీర్తన
సీతానగరం, డిసెంబర్ 8: మండలకేంద్రంలోని అయ్యప్ప, శివస్వాములు నగరసంకీర్తన నిర్వహించారు. పోలిపాడ్యమిని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా శివాలయం వరకు అయ్యప్పస్వాములు తిరువీధిలో పాల్గొన్నారు. ఈసందర్భంగా గురుస్వాములు సురేష్, బి శంకరరావులు మాట్లాడుతూ మనుషుల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. దైవభక్తి ఉండటం వలన మనిషిలో మంచి తనం పెరగుతుందన్నారు. అయ్యప్పదీక్షలను చేపట్టడం ప్రతీ ఒక్కరి అదృష్టమన్నారు. ఇందులో పాటించాల్సిన నియమాలు అత్యంత కఠినతరమని, ప్రతీ ఒక్కరి జీవితంలో మాలాధరణ చేసుకుని తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, శివస్వాములు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బి వంతెనకు మరమ్మతుల పనులు ప్రారంభం
* ఆదివారం ఉదయం 5గంటల వరకు ట్రాఫిక్ నిలుపుదల
సీతానగరం, డిసెంబర్ 8: మండల కేంద్రంలోని 36వ రాష్ట్రీయ రహదారిలో సువర్ణముఖి నదిపై ఉన్న ఆర్‌అండ్‌బి వంతెన మరమ్మతులకు గురైన విషయం విధితమే. ఈమేరకు మరమ్మతుల చర్యలను అధికారులు శనివారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఆర్‌అండ్‌బి, పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఒరిస్సా నుంచి పార్వతీపురం మీదుగా విజయనగరం వైపు రాకపోకలు చేసేవాహనాలను శనివారం రాత్రి 10గంటల నుంచి ఆదివారం ఉదయం 5గంటల వరకు నిలుపుదల చేశామన్నారు. అత్యవసరంగా తిరగాల్సిన వాహనాలను దారిమల్లించామన్నారు. 8గంటలలో వంతెన మరమ్మతులు పూర్తిచేస్తారో లేదో ప్రజలను అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం సభ్యత్వ నమోదు
కురుపాం, డిసెంబర్ 8: మండలంలోని మొండెంఖల్ గ్రామంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. శనివారం జిల్లా కో- ఆప్షన్ సభ్యులు రంజిత్‌కుమార్ నాయకో ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ సభ్యత్వాల నమోదు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో తెలుగుదేశంపార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అధికశాతం టీడీపీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. గ్రామాల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవల్సిన చర్యలను వివరిస్తు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలో అమలు జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ ఒక్కరికీ వివరిస్తున్నామన్నారు. టీడీపీని ఆదరించి రాబోయే ఎన్నికల్లో మద్ధతు పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేడుకగా పోలిపాడ్యమి
కురుపాం, డిసెంబర్ 8: కార్తీకమాసం పూర్తికావడంతో పోలిపాడ్యమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నెలరోజులపాటు కార్తీకమాస పూజలు నిర్వహించిన మహిళలు పోలిపాడ్యమి సందర్భంగా చెరువుల్లోను, నదీ పరివాహక ప్రాంతాల్లోను కార్తీక దీపాలను విడిచిపెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కురుపాంనకు చెందిన వందలాదిమంది తోటపల్లి నాగావళి నదీ తీరానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పోలిపాడ్యమి వేడుకలు సందడిగా జరిగాయి.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి
* విద్యతోనే వ్యవస్థలో మార్పు తేగలం * కృషి నీ ఆయుధం * మంత్రులు గంటా, సుజయ్‌కృష్ణ

విజయనగరం, డిసెంబర్ 4: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ‘కృషి నీ ఆయుధమైన..విజయం నీకు బానిస అవుతుంది’ అని చెప్పిన మహాత్మాగాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. శనివారం సాయంత్రం జెడ్పీ ఆవరణలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అధ్యక్షతన పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జిల్లాలో జెడ్పీ ద్వారా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం పట్ల జెడ్పీ చైర్‌పర్సన్‌ను అభినందించారు. ఇదే విధంగా మిగిలిన జిల్లాల్లో కూడా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని తాను ఆదేశిస్తానని చెప్పారు. అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘విద్యార్థులతో కాసేపు’ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. విద్యార్థులు కలెక్టర్‌ను చూసి స్ఫూర్తిని పొందడానికి ఇదొక చక్కటి మార్గమన్నారు. ఇక ఈ ఏడాది తొలిసారిగా ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1,71,841 మంది చేరారని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ విద్యా రంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించారని చెప్పారు. ఏటా దాదాపు రూ.25వేల కోట్లు విద్యారంగానికి వెచ్చిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఏ దేశము విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. జిల్లాలో 22వేల మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కోసం రూ.28 లక్షలు వెచ్చించడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ జిల్లాలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తోన్నామన్నారు. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన జిల్లా విద్యా రంగంలో ముందడుగులు వేస్తొందన్నారు. గత ఏడాది పదో తరగతిలో ఉన్న జిల్లా రానున్న ఏడాది మొదటి మూడు స్థానాల్లో సాధించడానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 351 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మరో 360 పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆమె కాంక్షించారు.