విజయనగరం

ముఖ్యమంత్రి యువనేస్తం అభ్యర్థులకు శిక్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మేనేజర్ పి చాముండేశ్వరరావు కోరారు. సోమవారం కురుపాంలో ఉన్న వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ డిగ్రీ కళాశాలలో యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చాముండేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ మండలంలోని యువతల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రోజుకు రెండు బ్యాచ్‌ల వద్ద ప్రతీ ఒక్కరికీ పూర్తిస్థాయిలో శిక్షణలు ఇస్తున్నామన్నారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఉద్యోగాలు సాధించేందుకు అవసరమయ్యే నైపుణ్యాలను వారిలో కల్పిస్తామన్నారు. దీనిని యువకులంతా సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడేందుకు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భానుప్రసాద్, అధ్యాపక సిబ్బంది, నిరుద్యోగులు పాల్గొన్నారు.

కురుపాంలో ట్రాఫిక్‌తో ఇబ్బందులు
కురుపాం, డిసెంబర్ 10: కురుపాం గ్రామంలో ప్రధాన రహదారిపై ఎప్పటికప్పుడు ట్రాఫిక్ తీవ్రమవుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం ఉదయం 8గంటల సమయంలో ట్రాఫిక్ ఏర్పడి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ద్విచక్రవాహనాల నుంచి లారీల వరకు పూర్తిగా రెండు గంటలసేపు ఆగిపోయాయి. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో ఇరుగ్గా ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతుంది. ఇటీవల కాలంలో కురుపాం మీదుగా గుమ్మలక్ష్మీపురం వైపు వచ్చిపోయే వాహనాలు అధికమవ్వడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనిని వెంటనే సరిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు. కురుపాం బస్టాండ్‌లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుచేస్తే ప్రయాణీకులకు సులభతరమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.